X

Telugu Movies in OTT, Theaters: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే…డోన్ట్ మిస్

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లలో విడుదలయ్యే సినిమాల జోరు పెరుగుతోంది. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, రాబోతోన్న వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం.

FOLLOW US: 

కరోనా తగ్గుముఖం పట్టడంతో నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో సినిమాలు విడుదలచేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చిత్రాలు ఓటీటీకే సై అంటున్నాయి. ఈ వారం వచ్చే సినిమాలేంటంటే...‘రిపబ్లిక్‌’: సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రలో దేవ కట్టా దర్శకత్వంలో తెరెకక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. ఈ సినిమా అక్టోబరు 1న థియేటర్లలో సందడి చేయనుంది.  ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. రమ్యకృష్ణ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు  ముఖ్య అతిథిగా హాజరైన పవన్‌కల్యాణ్‌ స్పీచ్ తో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ‘అసలు ఏం జరిగిందంటే’: 1999లో తెలుగు ప్రేక్షకులను మెప్పించి ‘దేవి’ సినిమాలో బాలనటుడు మహేంద్రన్‌ హీరోగా నటించిన  చిత్రం ‘అసలు ఏం జరిగిందంటే’. శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ బందరి దర్శకుడు. ఇదికూడా కరోనా కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘నో టైమ్‌ టు డై’: ఇప్పటికే  బాండ్‌ సిరీస్‌ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.   గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబరు 30న బాండ్‌ థియేటర్‌లలో సందడి చేయనున్నాడు. అమెరికాలో అక్టోబరు 8న  ప్రేక్షకుల ముందుకు రానుంది. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్‌ సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నాడు. కారీ జోజి దర్శకుడు.‘ఇదే మా కథ’: గురుపవన్ దర్సకత్వంలో  శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా  ‘ఇదే మా కథ’. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమా  అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది.  ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
‘ఒరేయ్ బామ్మర్ది’: సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం తో ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి ‘ఒరేయ్‌ బామ్మర్ది’ స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌
 చెహ్రే -సెప్టెంబరు 30
బింగ్‌ హెల్‌- అక్టోబరు 1
బ్లాక్‌ ఆజ్‌ నైట్‌- అక్టోబరు 1

నెట్‌ఫ్లిక్స్‌
బ్రిట్నీ వర్సెస్‌ స్పియర్స్‌ - సెప్టెంబరు 28
నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌- సెప్టెంబరు 29
ద గల్టీ- అక్టోబరు 1
డయానా -అక్టోబరు 1
డిస్నీ+హాట్‌స్టార్‌
షిద్ధత్‌ -అక్టోబరు 1
లిఫ్ట్‌- అక్టోబరు 1

సోనీ లివ్‌
ది గుడ్‌ డాక్టర్‌- సెప్టెంబరు 28

జీ5
బ్రేక్‌ పాయింట్‌ -అక్టోబరు 1

Also Read: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ కన్నుమూత, సోషల్ మీడియా ద్వారా ప్రముఖుల సంతాపం

Also Read: ఆదిపురుష్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్సైంది... రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇండిపెండెన్స్ డే కన్నా ముందే ట్రీట్..

Also Read: 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: upcoming movies Theaters Telugu Movies in OTT

సంబంధిత కథనాలు

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

TS Letters To KRMB : సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

TS Letters To KRMB :  సాగర్ ఆయుకట్టు పెంపుపై అభ్యంతరం.. కేఆర్ఎంబీకి తెలంగాణ కొత్తగా రెండు లేఖలు !

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు

AP TS Corona Updates:ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ