By: ABP Desam | Updated at : 06 Mar 2023 04:29 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Theaters
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల జోరు కాస్త తగ్గింది. విద్యార్థుల పరీక్షలు, వేసవి సెలవలు దృష్టిలో పెట్టుకొని పెద్ద సినిమాలు అన్నీ ఏప్రిల్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ సారి సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లూ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. గత వారం కూడా చిన్న సినిమాలు బానే విడుదల అయ్యాయి. ఇదే వరుసలో ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆ సినిమాలేంటో చూసేద్దాం రండి.
‘సి.ఎస్.ఐ సనాతన్’..
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమానే ఈ ‘సి.ఎస్.ఐ సనాతన్’. ఇందులో ఆదికు జంటగా మిషా నారంగ్ నటించింది. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. హత్య కేసును చేధించే సి.ఎస్.ఐ ఆఫీసర్ గా తెరకెక్కినట్టు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ట్యాక్సి’..
వసంత్ సమీర్ పిన్నమరాజు, ఆల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ నటీనటులుగా చేసిన సినిమా ‘ట్యాక్సీ’. ఈ సినిమాకు హరిష్ సజ్జా దర్శకత్వం వహించగా హరిత సజ్జా సినిమాను నిర్మించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం కూడా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘నేడే విడుదల’..
రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘నేడే విడుదల’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించామని చెప్పారు మేకర్స్. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది.
‘వాడు ఎవడు’..
ఈ వారం విడుదల కాబోతున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘వాడు ఎవడు’. ఈ మూవీకు ఎస్ శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ మార్చి 10న విడుదల చేయనున్నారు.
‘65’...
ఆడమ్ డ్రైవర్, అరియానా గ్రీన్ బ్లాట్, క్లో కోల్ మన్ నటించిన హాలీవుడ్ సినిమా ‘65’. ఈ సినిమాకు స్కాట్ దర్శకత్వం వహించారు. స్పేస్ షిప్ గుర్తుపట్టని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైయ్యాయి వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
‘యాంగర్ టేల్స్’...
తిలక్ ప్రభల దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘యాంగర్ టేల్స్’. జీవితంలో ఎన్నో ఆశలతో ఉన్న ఓ నలుగురు వ్యక్తులకు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనే అంశం పై ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ వెబ్ సిరీస్ మార్చి 9 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
‘రానా నాయుడు’..
విక్టరీ వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ‘రే డొనొవాన్’ టీవీ సిరీస్ ఆధారంగా తెలుగు నేటివిటీతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. వెంకటేష్, రానా ఇద్దరికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్
‘రేఖ’(మలయాళం) మార్చి 10
‘ది గ్లోరి’ వెబ్ సిరీస్ 2, మార్చి 10
అమెజాన్ ప్రైమ్
హ్యాపీ ఫ్యామిలీ: కండీషన్స్ అప్లయ్ (హిందీ సిరీస్) మార్చి 10
డిస్నీ+హాట్ స్టార్
చాంగ్ కెన్ డంక్ (మూవీ) మార్చి 10
రన్ బేబీ రన్ (తమిళ/తెలుగు చిత్రం) మార్చి 10
జీ5
రామ్ యో(కన్నడ) మార్చి 10
బొమ్మై నాయగి(తమిళ్) మార్చి 10
బౌడీ క్యాంటీన్ (బంగ్లా) మార్చి 10
సోనీ లీవ్
యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో(తమిళ్ సిరీస్) మార్చి 10
క్రిస్టీ(మలయాళం) మార్చి 10
బ్యాడ్ ట్రిప్(తెలుగు) మార్చి 10
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?