Tollywood Bollywood Tie-Up: టాలీవుడ్, బాలీవుడ్ ఇక భాయి భాయి - ‘మా’తో కీలక ఒప్పందం, ఎవరికి లాభమంటే?
‘మా’తో బాలీవుడ్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం తెలుగు సినిమాలు చేసే బాలీవుడ్ కళాకారులకు మా మెంబర్ షిప్ అందిస్తారు. బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి అక్కడి సభ్యత్వం ఉంటుంది.
మంచు విష్ణు అధ్యక్షుడిగా ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కీలక ముందడుగు వేసింది. సినేటా(హిందీ ఫిల్మ్ అండ్ టీవీ అసోసియేషన్) అత్యంత ముఖ్యమైన ఒప్పదం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం, బాలీవుడ్ లో నటించే తెలుగు నటీనటులకు, తెలుగులో నటించే బాలీవుడ్ నటీనటులకు కీలక ప్రయోజనాలు చేకూరనున్నాయి. తాజాగా ఈ అగ్రిమెంట్ కు సంబంధించిన విషయాలను మా ప్రెసిడెంట్ మంచు విష్ణు తెలిపారు.
టాలీవుడ్ తో జతకట్టిన బాలీవుడ్
తెలుగు సినిమా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నటీనటుల ప్రతిభను ఇచ్చిపుచ్చుకోవడానికి, వారి ప్రయోజనాలను కాపాడేందుకు బాలీవుడ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో జతకట్టింది. ఈ ఒప్పందం ద్వారా తెలుగు సినిమాల్లో పని చేసే బాలీవుడ్ ఆర్టిస్టులకు సభ్యత్వం లభిస్తుంది. MAA నుంచి హెల్త్ స్కీమ్, ఆర్బిట్రేషన్ వంటి కీలకమైన ప్రయోజనాలను పొందేందుకు కూడా ఈ టై-అప్ బాలీవుడ్ నటీనటులకు దోహదపడుతుంది. అంతేకాదు, తాజా నిర్ణయం ప్రకారం తెలుగు నటీనటులకు బాలీవుడ్ లో మేలు జరిగే అవకాశం ఉండగా, తెలుగు సినిమాల్లో నటించే బాలీవుడ్ ఆర్టిస్టులకు ఇక్కడ లబ్ది చేకూరనుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పని చేస్తున్నప్పుడు ఏవైనా వివాదాలు తలెత్తితే రెండు అసోసియేషన్లు ఉమ్మడిగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అంతేకాదు, MAA నుంచి హెల్త్ స్కీమ్, మధ్యవర్తిత్వం వంటి కీలక ప్రయోజనాలను పొందేందుకు కూడా బాలీవుడ్ ఆర్టిస్టులకు దోహదపడుతుంది.
Movie Artists Association of Telugu cinema joins hands with Bollywood Artists Association, fostering a historic collaboration between Telugu and Bollywood industries. Exciting times ahead! #CINTAA #MAA #Bollywood https://t.co/lKdXaEKMeW pic.twitter.com/GF4maGv6Mv
— MAA Telugu (@itsmaatelugu) June 23, 2023
మహిళా కళాకారుల భద్రత కోసం హై పవర్ కమిటీ
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అసోసియేషన్లు కలిసి మహిళా నటులకు భద్రత కోసం ‘మహిళా కళాకారుల సాధికారత ప్యానెల్’ ఏర్పాటు చేశాయి. దీని ద్వారా మహిళా కళాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వారి భద్రతకు పెద్ద పీట వేయనున్నారు. మహిళా కళాకారుల ప్రయోజనాలను కాపాడేందుకు మా ఒక ఫూల్ ప్రూఫ్ యాక్షన్ ప్లాన్‌ను కమిటీ రూపొందించింది. ఈ కమిటీకి గౌరవాధ్యక్షురాలిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీతా కృష్ణన్‌ను కూడా విష్ణు ఎంపిక చేశారు. త్వరలోనే మహిళా ఆర్టిస్టులు భద్రతకు తీసుకోవాల్సిన చర్యల పట్ల ఓ పత్రాన్ని రూపొందించనున్నారు.
Read Also: ఆ హీరోల పాన్ ఇండియా సక్సెస్ పట్ల పవన్ కళ్యాణ్ చాలా అసూయతో ఉన్నారు - సినీ క్రిటిక్ తీవ్ర వ్యాఖ్యలు
మా ప్రతిపాదనకు సినేటా ఆమోదం!
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ కలిసి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక్కటిగా ఉండాలని ప్రతిపాదించారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ ఫిల్మ్ అండ్ టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఇలాంటిట ఒప్పందం జరుగుతుందని మంచు విష్ణు తెలిపారు. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial