News
News
X

Vishnu Priya Mother Died: యాంకర్ విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం - జీవితాంతం రుణపడి ఉంటా అమ్మా అంటూ భావోద్వేగం

ఇటీవల టీవీ యాంకర్ విష్ణు ప్రియ తల్లి మరణించింది. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. ఆమె తల్లి మరణం పట్ల ఆమె అభిమానులు, పలువురు సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

టీవీ యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని విష్ణుప్రియ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విష్ణు ప్రియ పోస్ట్ తో ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణుప్రియ తల్లి మరణవార్త పట్ల సంతాపం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. తన తల్లి మరణ వార్త గురించి చెప్తూ విష్ణు ప్రియ భావోద్వేగానికి గురైంది. తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ తో పాటు ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేసింది. 

విష్ణు ప్రియ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. ‘‘నా ప్రియమైన అమ్మ.. ఈరోజు వరకూ నువ్ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యావాదాలు తెలుపుతున్నాను. నా కడ శ్వాస వరకూ నీ పేరు నిలబెట్టేందుకు నేను కృషి చేస్తాను. ఎప్పుడూ నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో లేకపోవచ్చు.. కానీ నా ప్రతీ శ్వాసలో నువ్వు ఉంటావని తెలుసు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు, అందుకే నేను నీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా’’ అంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి పలువురు ఆమె కుంటుంబానికి సానుభూతిని తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

విష్ణు ప్రియ కెరీర్ ప్రారంభంలో యూట్యూబర్ గా చేసింది. పలు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. తరువాత యాంకర్ గా కెరీర్ ను మార్చుకుంది. సుడిగాలీ సుధీర్ తో కలసి ‘పోవే పోరా’ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కామెడీ షో లో విష్ణ ప్రియ యాంకరింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు యాంకర్ గా మంచి పేరు వచ్చింది. తరువాత పలు టీవీ షో లలో చేసి మరింత పాపులర్ అయింది. ఓ పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క హీరోయిన్ గా ప్రయత్నించింది. ఆ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు కూడా ఎదుర్కొంది విష్ణు ప్రియ. ఆమె ఫేస్ బుక్ హ్యాక్ అవ్వడంతో ఆమెపై నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నిటినీ పట్టించుకోకుండా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో పలు సినిమాల్లో కూడా నటిందింది. ఈ మధ్య విడుదలైన ‘వాంటెడ్  పండుగాడు’ సినిమాలో నటించింది విష్ణు ప్రియ. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం టీవీ షో లతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది యాంకర్ విష్ణు ప్రియ. 

Read Also: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్

Published at : 27 Jan 2023 01:20 PM (IST) Tags: Vishnu Priya anchor vishnu priya Vishnu Priya Mother Vishnu Priya Movies

సంబంధిత కథనాలు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!