అన్వేషించండి

Tammareddy Bharadwaj: ‘ఆదిపురుష్’ ఫ్లాప్ కాదు - 2023 టాలీవుడ్ మూవీస్‌పై తమ్మారెడ్డి భరద్వాజ రివ్యూ

Tammareddy Bharadwaj: 2023 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అందుకున్నాయన్నారు.

Tammareddy Bharadwaj About Tollywood 2023: తెలుగు సినిమా పరిశ్రమలకు ఈ ఏడాది(2023) ఎంతో మంచి సక్సెస్ అందించిందన్నారు. కొన్ని సినిమాలు మినహా, చాలా చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయన్నారు. కొన్ని పెద్ద సినిమాల విషయంలో మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ జరిగిన మాట వాస్తవం అన్నారు. “‘ఆది పురుష్’ సినిమా ఫెయిల్ అయ్యింది అని చెప్పలేం. రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆల్ ఇండియా టాప్ మూవీస్ రికార్డులలో ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. చండాలంగా తీసి అంచనాలకు అనుకూలంగా ఆడలేదని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా ఫెయిల్యూర్ అనడం కంటే కాస్ట్ ఫెయిల్యూర్ అనడం కరెక్ట్ అవుతుంది” అన్నారు.

‘ఏజెంట్’ ఈ ఏడాది పెద్ద ఫెయిల్యూర్ మూవీ- భరద్వాజ

ఏజెంట్’ అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఏడాది పెద్ద ఫెయిల్యూర్ అన్నారు భరద్వాజ. పెద్ద దర్శకుడు, మంచి బడ్జెట్, హీరో సినిమా కోసం కష్టపడ్డా సక్సెస్ కాలేదన్నారు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాలేదన్నారు. రవితేజ ‘రావణాసుర’ విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. ఈ సినిమాకు ముందు, తర్వాత సినిమాలు కూడా సక్సెస్ అయినా, ‘రావణాసుర’ ప్రేక్షకులను అలరించలేకపోయిందన్నారు. కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ విషయం కాస్త డిఫరెంట్ అన్నారు. టాలీవుడ్ లో నందమూరి కల్యాణ్ రామ్ కన్సిస్టెంట్ హీరోగా కాదన్నారు. ఆయన మార్కెట్ కూడా విచిత్రంగా ఉంటుందన్నారు. ఆయన సినిమాలు కొన్ని అద్భుతంగా ఆడుతాయని, మరికొన్ని అస్సలు ఆడవని చెప్పారు.  

‘శాకుంతలం’ మీద అంచనాలే లేవు- భరద్వాజ

ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ మీద బయటకు అనుకున్నంత అంచనాలు లేవన్నారు భరద్వాజ. ఆ సినిమా ఓపెనింగ్స్ ఏమాత్రం అనుకూలంగా లేవన్నారు. అలాంటప్పుడు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోలేమన్నారు. అందుకే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిందన్నారు. ‘స్కంధ’ విషయంలోనూ కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. రామ్ పోతినేని సినిమాలు రూ. 30 నుంచి రూ. 40 కోట్లు సాధిస్తాయన్నారు. ఆయన మార్కెట్ ను బేస్ చేసుకుని బోయపాటి ఖర్చు పెట్టాలి కానీ, బాలయ్యకు పెట్టినంత బడ్జెట్ పెడతానంటే నష్టపోక తప్పదన్నారు.

ప్రజలు సినిమాలు చూడాలని తీయండి- భరద్వాజ

తెలుగు సినిమా పరిశ్రమలో కథల మీద మంచి ఫోకస్ పెడితే చక్కటి విజయాలు అందుతాయని చెప్పారు భరద్వాజ. ‘బేబీ’ లాంటి చిన్న సినిమాలు ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయన్నారు. ‘బలగం’ లాంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయన్నారు. కానీ, పెద్ద హీరోల సినిమాలు సబ్జెక్ట్ లేకుండా హిందీ డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తాయనే ఆలోచనతో తీస్తున్నారని చెప్పారు.  తెలుగులో ఆడినా ఆడకపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారని చెప్పారు. తెలుగులో ఆడాలి అనుకుంటే మంచి సినిమాలు వస్తాయి. లేదంటే ఫెయిల్యూర్స్ ఎదురవుతాయన్నారు.

ఇక ‘సలార్’ సినిమాపై ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయని, అనుకున్నట్లుగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పారు భరద్వాజ. అటువరుస సెలవులు రావడంతో మంచి వసూళ్లు  సాధించిందన్నారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి, ‘భగవంత్ కేసరి’, ‘బలగం‘ ‘విరూపాక్ష‘ లాంటి సినిమాలు ఈ ఏడాది మంచి సక్సెస్ అందుకున్నాయన్నారు.   

Also Read : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Sharmila on AP Elections 2024 | ఏపీ ఎన్నికల పోలింగ్ పై మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ షర్మిల | ABP DesamPawan Kalyan Casts his Vote At Mangalagiri | భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్Balakrishna Casts His Vote At Hindupur | హిందూపురంలో ఓటేసిన బాలకృష్ణ | ABP DesamChandrababu naidu Casted Vote | ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
Amazon: అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
Embed widget