Sarath Kumar Hospitalized: నటి రాధిక భర్త, నటుడు శరత్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత, ఆందోళనలో అభిమానులు
తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన డయేరియా, డీహైడ్రేషన్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన డయేరియా, డీహైడ్రేషన్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రాణాపాయం తప్పిందని వైద్యుల వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శరత్ కుమార్ భార్య, కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసుపత్రికి చేరుకున్నారు.
అభిమానుల ప్రార్థనలు
శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత అని తెలియగానే ఆయన అభిమానులు షాక్ గురయ్యారు. దీంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అభిమానులు చేరుకుంటున్నారు. శరత్ కుమార్ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలి, పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తమిళ సినీ వర్గాల్లోనూ శరత్ కుమార్ ఆరోగ్యంపై టెన్షన్ మొదలైంది.
కరోనా నుంచి కోలుకొని..
శరత్ కుమార్ కు డిసెంబర్ 2020లో కరోనా సోకింది. ఈ విషయాన్ని నటి రాధిక సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. శరత్ కుమార్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పింది. అయినా కూడా మంచి వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. శరత్ కుమార్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం శరత్ కుమార్ కు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్యం పై వైద్యుల హెల్త్ బులిటెన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
Read Also: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?
శరత్ కుమార్ జూలై 14, 1954 లో డిల్లీ లో జన్మించారు. ఆయన కేవలం సినిమా నటుడు గానే కాకుండా విలేకరి, బాడీ బిల్డర్, రాజకీయ నాయకుడిగానూ అందరికీ సుపరిచితం. ఆయన తమిళ, మలయాళ, తెలుగు కన్నడ భాషల్లో కలిపి 130 పైగా సినిమాల్లో నటించారు. 1986 లో ‘సమాజంలో స్త్రీ’ అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కెరీర్ మొదట్లో నెగటివ్ పాత్రల్లో నటించిన ఆయన తర్వాత సహాయ పాత్రలు ఆ తర్వాత హీరోగా నటించారు. ఆయన విలక్షణ నటనతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ కుమార్. అందుకే ఆయన్ను తమిళ పరిశ్రమలో ‘సుప్రీం స్టార్’ అని పిలుచుకుంటారు అభిమానులు. ఆయన 1984 లో ఛాయను వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమెకు 2000 సంవత్సరంలో విడాకులు ఇచ్చి, తర్వాత నటి రాధిక ను 2001 లో వివాహం చేసుకున్నారు. శరత్ కుమార్ కు వరలక్ష్మీ తో కలిపి నలుగురు సంతానం ఉన్నారు.