Lokesh Kanagaraj: లోకేష్ మల్టీవర్స్‌లో విజయ్ - ఒకే సినిమాలో విజయ్, కమల్, సూర్య, కార్తీ?
విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో రానున్న సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుందని తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు (తెలుగులో వారసుడు)’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతోంది. విజయ్ తన తర్వాతి సినిమా కోసం ‘మాస్టర్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో తిరిగి చేతులు కలపనున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోనే విజయ్ తర్వాతి సినిమా తెరకెక్కుతుందని ఖైదీ, విక్రమ్ సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించిన నటుడు నరేన్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ రెండు సినిమాల్లోనూ నరేన్ ‘బిజోయ్’ పాత్రలో కనిపించారు.‘#Thalapathy67’ కూడా లోకేష్ యూనివర్స్‌లోనే తెరకెక్కనుందని కానీ తాను ఆ సినిమాలో కనిపించబోనని నరేన్ చెప్పారు. తన పాత్ర తిరిగి కార్తీ హీరోగా నటించే ‘ఖైదీ 2’ కనిపిస్తుందన్నారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటివరకు ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యి సౌత్ ఇండియాలో మొదటి సినిమాటిక్ యూనివర్స్‌ను ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో లోకేష్ తన యూనివర్స్‌ను మరింత పెద్దది చేసే ప్రయత్నాల్లో పడ్డాడు. విజయ్‌ను ఈ యూనివర్స్‌లోకి తీసుకురావడం కూడా అందులో భాగమే.
లోకేష్ - విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా క్యాస్టింగ్ గురించి కూడా ఇప్పటివరకు చాలా రూమర్లు వినిపించాయి. సంజయ్ దత్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడని తెలిసింది. విజయ్ ఈ సినిమాలో మధ్యవయస్కుడైన డాన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. తనకి జోడిగా త్రిష కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మరో తమిళ హీరో విశాల్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారని కోలీవుడ్ కోడై కూస్తుంది.
ఈ యూనివర్స్‌లో భాగం అయిన సూర్య, కార్తీ, కమల్ హాసన్‌లు కూడా విజయ్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో కార్తీని ప్రశ్నించగా అవునని, కాదని చెప్పకుండా సమాధానం దాటవేశాడు. అప్పట్నుంచి ఈ పుకార్లకు మరింత బలం వచ్చింది.
ఇప్పటివరకు కనీసం ప్రకటన కూడా రాని ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో సాగుతుంది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్‌నే రూ.300 కోట్ల వరకు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. కేవలం అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌తో రూ.160 కోట్ల డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి. విజయ్ ‘వారిసు’ షూటింగ్ ముగియగానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 2023 దీపావళి నాటికి ఈ సినిమాను అన్ని భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
CONFIRMED: #Thalapathy67 will be a LCU film.pic.twitter.com/F4hj87wc19
— LetsCinema (@letscinema) November 20, 2022
Is in Part of the LCU #Thalapathy67 💥💥💥 @actorvijay pic.twitter.com/OTuAeWSHjc
— #Thalapathy67 (@TheVijay67FiIm) November 20, 2022