By: ABP Desam | Updated at : 26 Jul 2023 01:11 PM (IST)
Image credit: Tamannaah Bhatia/Instagram
Tamannaah: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల గురించి వచ్చే పుకార్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అవి నిజమో కాదో అనేది అందుకు సంబంధించిన వాళ్లు స్పందించే వరకూ తెలియదు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కూడా ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె దగ్గర ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డైమండ్ రింగ్ ఉందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటి వరకూ స్పందించని తమన్నా రీసెంట్ గా ఆ డైమండ్ రింగ్ కు గురించి అసలు విషయాన్ని వెల్లడించింది. దాని సీక్రెట్ ను బయటపెట్టింది.
ఆ వజ్రాన్ని ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిందా?
తమన్నా దగ్గర ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డైమండ్ ఉందని, దాని ధర సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ డైమండ్ రింగ్ ను తమన్నాకు రామ్ చరణ్ భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిందనే ప్రచారం జరిగింది. 2019 లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తమన్నా నటనను మెచ్చిన ఉపాసన ఆ ఖరీదైన డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చిందని అన్నారు. అప్పట్లో తమన్నా, ఉపాసన కలిసి దిగిన ఫోటోలలో తమన్నా ఆ డైమండ్ రింగ్ పెట్టుకొని ఉండటంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారంతా.
అది డైమండ్ రింగ్ కాదు బాటిల్ ఓపెనర్: తమన్నా
అయితే తాజాగా తమన్నా ఆ డైమండ్ రింగ్ వెనకున్న స్టోరీను బయటపెట్టింది. తన చేతికి డైమండ్ ఆభరణాన్ని ధరించిన ఓ ఫోటోను షేర్ చేసింది తమన్నా. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘‘ఈ విషయాన్ని చెప్పడానికి బాధగా ఉంది. ఆ రోజు మేము కేవలం బాటిల్ ఓపెనర్‌తో ఫోటో షూట్ చేశాం. నేను వేలికి ధరించింది నిజమైన వజ్రం కాదు. అది బాటిల్ ఓపెనర్’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ..
తమన్నా ఇండస్ట్రీకు వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అదే గ్లామర్ తో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్ 2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది తమన్నా. ఇందులో ఆమె గ్లామర్ తో యూత్ ను ఆక్టుకుంది. అలాగే ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. అలాగే తమన్నా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జైలర్’ సినిమాలో కూడా నటించింది. దీనితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో భాగం కానుంది తమన్నా. అలా చేతినిండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది మిల్కీ బ్యూటీ.
Also Read: ఆ రోజు మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది: పవన్ కళ్యాణ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Naga Panchami December 6th శివయ్య ఎదురుగానే ప్రాణం వదిలేస్తా.. షాకిచ్చిన పంచమి!
Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!
Jagadhatri December 6th Episode : అవమానంతో రగిలిపోతున్న యువరాజ్.. మీనన్ హ్యాండ్ ఓవర్లో ధాత్రి
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
/body>