Tamannaah Dating : పార్టీలో లిప్ కిస్ ఇస్తూ దొరికేసిన తమన్నా - హైదరాబాదీ నటుడితో డేటింగ్
Tamannaah Kissing Vijay Varma : తమన్నా ప్రేమలో ఉన్నారా? అంటే ముంబై జనాలు 'అవును' అంటున్నారు. న్యూ ఇయర్ పార్టీలో లిప్ కిస్ ఇస్తూ ఆమె దొరికిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah) ప్రేమలో ఉన్నారా? అంటే... 'ఓ యస్', 'అవును అవును' అని ముంబై జనాలు చెబుతున్నారు. గోవాలో ఆమెను చూసిన జనాలు అయితే 'ఏం సందేహం లేదు' అంటూ జవాబు ఇస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
గోవాలో 2023కి వెల్కమ్...
విజయ్ వర్మతో కిస్సింగ్!
గోవాలో 2023కి తమన్నా వెల్కమ్ చెప్పారు. ఆమెతో పాటు నటుడు విజయ్ వర్మ (Vijay Varma) కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన సందర్భంగా ఆకాశంలో తారాజువ్వల వెలుగులు మిరుమిట్లు గొలుపుతుంటే, నేలపై ఈ తారలు ఇద్దరూ రొమాన్స్‌లో మునిగి తేలారు.
హిందీలో 'పింక్' సినిమాతో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'గల్లీ బాయ్'లో కూడా ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది ఆలియా భట్‌కు జోడీగా నటించిన 'డార్లింగ్స్' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శాడిస్ట్ ప్రేమికుడు, భర్తగా విజయ్ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది.
అన్నట్టు... విజయ్ వర్మ హైదరాబాదీ. అవును, అతడు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. అతడిది మార్వాడీ ఫ్యామిలీ. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. నాని హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశాడు. విజయ్ వర్మ నటించిన తెలుగు సినిమా అదొక్కటే. తమన్నా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు పదేళ్ళుగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు. అందుకని, ఎలా పరిచయం అయ్యింది? ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తాము ప్రేమలో ఉన్నట్టు తమన్నా గానీ, విజయ్ వర్మ గానీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కనీసం కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు. అదీ సంగతి!
Also Read : జనవరిలో తెలుగు థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవో చూడండి
View this post on Instagram
Tamannaah Bhatia and Vijay Varma are dating each other WOW ! That brings smile to my face ! TOTALLY SHIPPING
— . (@boyfriendkapoor) January 2, 2023
పెళ్ళి వార్తలు ఖండించిన తమన్నా
తమన్నా త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారని, ముంబైకు చెందిన ఓ యువ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు. ''ఏంటి? నేను పెళ్లి చేసుకోబోతున్నానా? సీరియస్‌లీ??'' అని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తొలుత తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ''నాకు కాబోయే భర్త, వ్యాపారవేత్తను పరిచయం చేస్తున్నాను. చూడండి'' అని వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎవరు ఉన్నారో తెలుసా? 'ఎఫ్ 3'లో కొంత సేపు ఆమె మగరాయుడి వేషం వేశారు కదా! ఆ గెటప్ అది! దాంతో తమన్నా పెళ్లి అంటూ వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు మాత్రమేనని ఆవిడ స్పష్టం చేసినట్టు అయ్యింది.
Also Read : ఫిబ్రవరిలో ఒకే రోజు నాలుగు సినిమాలు - మళ్లీ థియేటర్ల రచ్చ?
తెలుగులో చిరంజీవికి జోడీగా...
ప్రస్తుతం తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న చిత్రమిది. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు.