By: ABP Desam | Updated at : 06 Mar 2023 01:31 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Tamannaah Bhatia/ instagram
తమన్నా భాటియా. 15 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్ అగ్రహీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌత్ లో సత్తా చాటిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తోంది. హైదరాబాదీ విజయ్ వర్మతో డేటింగ్ రూమర్స్ తో తరచుగా వార్తల్లో నిలుస్తున్న ఈ నటీమణి, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల గురించి తాజాగా బయటకు చెప్పింది. వాటి మూలంగా ఎంత క్షోభ అనుభవించిందో వివరించింది.
15 ఏళ్ల వయసులోనే సినీ కెరీర్ మొదలు పెట్టినట్లు చెప్పిన తమన్నా, అప్పటి నుంచి తన జర్నీ ఎలా సాగిందో చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించింది. నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు జనాలు తనను చిన్న చూపు చూసినట్లు చెప్పింది. “నటిగా మారాలి అనుకున్నప్పుడు చాలా మంది చిన్న చూపు చూశారు. స్కూల్‌లో ఉన్నప్పుడు చాలా మంది తాను నటిని కావాలనుకుంటున్నాను అంటే అదోలా చూసేవారు. అయినా, నేను వాటి పట్టించుకోలేదు. స్కూల్ డేస్ లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతో షూటింగ్స్ తో పాటు స్టడీస్‌ను బ్యాలెన్స్ చేసుకునేదాన్ని. బయటి వారు ఎన్ని మాట్లాడుకున్నా.. మా కుటుంబ సభ్యులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. వారు నేను ఇండస్ట్రీలో బాగా రాణిస్తానని నమ్మేవారు. బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, శ్రీదేవిని ఎంతో ఇష్టపడేదాన్ని. వారిని చూసే ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నాను. తొలిసారి కమర్షియల్ యాడ్‌లో నటించాను. బోర్డ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ ఆఫర్ వచ్చింది. పగటి పూట షూటింగ్ లో పాల్గొంటూ రాత్రి పూట చదువుకునే దాన్ని” అని వివరించింది.
తన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. “నా సినీ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. దేనికీ తల వంచలేదు. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎప్పుడూ వదులుకోలేదు. అవకాశాలు వస్తున్నప్పుడు కూడా సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని చూసి భయపడలేదు. నా కుటుంబ సభ్యులు కూడా ఇతరుల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. కెరీర్ స్టార్టింగ్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. పురుషాధిక్య సమాజంలో మహిళలు తాము అనుకున్న సాధించడం అంత ఈజీ కాదు. కానీ, నా పేరెంట్స్ సపోర్టుతో ఇండస్ట్రీలో రాణించాను” అని చెప్పింది.
తమన్నా ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘భోలా శంకర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన ‘జైలర్’ చిత్రంలో నటిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్2’ అనే హిందీ వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ, ప్రస్తుతం బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో ఆమె చివరిసారిగా ‘బబ్లీ బౌన్సర్’ సినిమా చేసింది. తెలుగులో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో కనిపించింది.
Read Also: నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు - షాకింగ్ విషయాలు వెల్లడించిన కుష్బూ
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?