By: ABP Desam | Updated at : 06 Mar 2023 08:56 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Kushboo Sundar/iInstagram
ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటి కుష్బూ సుందర్. తెలుగులోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ మధ్యే జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పదవి చేపట్టారు. తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా లైగింక వేధింపులకు గురైనట్లు చెప్పారు. చిన్న వయసులోనే తన తండ్రే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలు వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుష్బూ, పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. అదీ, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి నుంచే కావడం దారుణం అన్నారు. 8 ఏళ్ల వయసులోనే తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు చెప్పారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలు పెట్టినట్లు తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయినట్లు చెప్పారు. “పిల్లలు వేధింపులకు గురైనప్పుడు, ఆ ఘటనను వారు జీవితాంతం మర్చిపోలేరు. అదో మచ్చగా మిగిలిపోతుంది. నా తల్లి అత్యంత దారుణమైన వివాహ జీవితాన్ని ఎదుర్కొంది. నిత్యం మా అమ్మను, మమ్మల్ని కొట్టేవాడు. నన్ను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించేవాడు. 8 ఏళ్ల వయసు నుంచే సెక్స్ వల్ హెరాస్ మెంట్ ఎదుర్కొన్నాను. 15 ఏళ్ల వయసులో అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది. 16 ఏళ్ల వయసు వచ్చే నాటికి తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం మా అమ్మకు చెప్పలేదు. తనకు ఇప్పుడు చెప్పినా నమ్మకపోవచ్చు” అని కుష్బూ తెలిపారు. లైంగిక వేధింపుల గురించి కుష్బూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చిన్న తనంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
ముంబైలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన కుష్బూ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ‘ది బర్నింగ్ ట్రైన్’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 2010లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. డిఎంకె పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెను జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియమించింది. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు.
Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!