News
News
X

Babli Bouncer Trailer: ‘బబ్లీ బౌన్సర్’ తెలుగు ట్రైలర్: కండోమ్‌లు కొంటున్న తమన్నా, రూట్ మార్చిన మిల్కీ బ్యూటీ!

తమన్నా మెయిన్ రోల్ లో నటించిన తాజా సినిమా ‘బబ్లీ బౌన్సర్‌’. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. లేడీ బౌన్సర్‌గా తమన్నా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించింది.

FOLLOW US: 

పాన్ ఇండియా స్టార్, మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ టు నార్త్.. పలు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.  దక్షిణాదిలో తమన్నాకు మంచి హిట్సే ఉన్నాయి. కానీ, బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగిన హిట్స్ దక్కలేదు. అయినా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్‌’ అనే సినిమా చేస్తోంది. బాక్స‌ర్స్ టౌన్ గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ

ఇందులో తమన్నా మాస్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సర్స్ ఊళ్లో లేడీ బాక్సర్ గా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. మగ రాయుడిగా బలాదూర్ తిరిగే అమ్మాయిగా ఇందులో కనిపిస్తుంది. మెడికల్ షాప్ కు వెళ్లి ఏమాత్రం బెరుకు లేకుండా ‘‘కండోమ్ ఇవ్వండి’’ అని అడిగేంత దమ్మున్న అమ్మాయి ఈ బబ్లీ. మల్లయోధురాలిగా, మగవాళ్లకు దీటుగా ఎదుగుతుంది. చివరకు ఢిల్లీలో లేడీ బౌన్సర్ గా ఉద్యోగం సంపాదిస్తుంది. అక్కడ ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోబోతుంది అనే విషయాన్ని సినిమాలో చూపించనున్నాడు దర్శకుడు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో తమన్నా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు సినీ అభిమానులు. 

సెప్టెంబర్ 23 డిస్నీప్లస్ హాట్స్టార్లో రిలీజ్

‘బబ్లీ బౌన్సర్‌’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో థియేటర్లలో హిట్ అందుకోవాలని తమన్నా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేట‌ర్ల‌ను స్కిప్ చేయడమే మంచిది అనుకున్నారు దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్. నేరుగా  ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. బబ్లీ బౌన్సర్ ను సెప్టెంబ‌ర్ 23న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకానున్నట్లు వెల్ల‌డించారు. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఇప్పటికే పూర్త‌య్యాయ‌ని తెలిపారు.

లేడీ బౌన్సర్ ఆధారంగా స్తున్న తొలి సినిమా

గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్  తెలిపారు.  బాక్స‌ర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ లేడీ బౌన్స‌ర్ గా న‌టించిందన్నారు. దేశంలో తొలిసారిగా ఓ లేడీ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలి సినిమా ఇదే అన్నారు. 

కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుందని తమన్నా చెప్పింది.  ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి సారిగా న‌టించ‌డం సంతోషంగా ఉందన్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. తమన్నా మ‌రోవైపు తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న భోళాశంక‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌త్య‌దేవ్‌ తో క‌లిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది.

Published at : 05 Sep 2022 03:04 PM (IST) Tags: Tamannaah Bhatia Babli Bouncer Madhur Bhandarkar Babli Bouncer Trailer Babli Bouncer Telugu Trailer

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్