'Bhola Shankar':అయితే చందమామ..లేదంటే మిల్కీ బ్యూటీ…మరోవైపు ఫేస్ టర్నింగ్ ఇవ్వని మెగాస్టార్..
సీనియర్ హీరోలను హీరోయిన్ల కొరత వెంటాడుతోందా… యంగ్ హీరోయిన్లు డేట్స్ ఇవ్వరు, సీనియర్ ముద్దుగుమ్మలు బోర్ కొట్టేశారు. అందుకే అగైన్ అండ్ అగైన్ అంటున్నారా…!
ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'ఖైదీ 150' తర్వాత 'సైరా' కి కాస్త గ్యాప్ తీసుకున్నా ఆ తర్వాత మాత్రం వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. ప్రస్తుతం కొరటాల శివతో “ఆచార్య”, మోహన్ రాజాతో “గాడ్ ఫాదర్”, మెహర్ రమేష్ “భోళా శంకర్”, ఇంకా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో సహా దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వరుస సినిమాల కన్నా మెగాస్టార్ జోడీపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కాజల్ లేదంటే తమన్నా పేర్లు తెరపైకి రావడంపై ఫిల్మ్ నగర్లో చర్చ జరుగుతోంది.
Also read: చిరు- నాగ్ ల కాంబోలో విక్రమ్ వేద రీమేక్? వైరలవుతున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్
ఖైదీ నంబర్ 150 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఆ తర్వాత సైరాలో నయనతారతో పాటూ తమన్నా మరో హీరోయిన్. ఇక ఆచార్యలో మళ్లీ కాజల్, ఇప్పుడు మళ్లీ భోళా శంకర్ సినిమాలో మళ్లీ తమన్నా నటించబోతోందని అంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, పూజా హెగ్డే డేట్స్ ఖాళీగా లేవు. పైగా వాళ్లు ప్రస్తుతం యంగ్ హీరోలతో జోడీ కడుతున్నందున సీనియర్స్ తో సై అంటారని చెప్పలేం. ఇక త్రిష అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టేసిందని చెప్పొచ్చు. శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఒరిజినల్‌లో శృతి అజిత్‌తో రొమాన్స్ చేసింది. అందుకే చిరుతో కూడా ఆమెనే అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల మెగాస్టార్ ఇప్పుడు శృతి ప్లేస్ లో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంచుకున్నారు. గతంలో ఆమె “సైరా”లో చిరతో కలసి నటించినా పాత్ర పరంగా మంచి పేరు సంపాదించుకుంది కానీ చిరుతో చిందేయలేదు. దీంతో ఈ సారి డాన్స్ ట్రీట్ కూడా ఉండబోతోందని మెగా అభిమానులు ఫిక్సైపోయారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుందనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read: అందమైన లోకం..అందులోన నువ్వు అద్భుతం..రాశీ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్ల రియాక్షన్
తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ 'భోళాశంకర్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రం. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేశ్ నటించబోతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది. మహతి సాగర్ సంగీత దర్శకుడు. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఊటీలో “గాడ్ ఫాదర్” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా వాయిదాలు పడడంతో ఏకంగా వచ్చే ఏడాది చిరంజీవికి మూడు సినిమాల రిలీజ్ కానున్నాయన్నమాట. అటు తమన్నా కూడా జోరుమీదుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటినా జోరు తగ్గలేదు. ఈ మధ్యే వరుసగా సీటీమార్, మ్యాస్ట్రో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్నాయి. త్వరలో ‘ఎఫ్3’, ‘దటీజ్ మహాలక్ష్మి’ తదితర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ..రష్మీ లేటెస్ట్ ఫొటోస్