Takkar Teaser: ‘టక్కర్’ టీజర్: సిద్దార్థ్ - దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ రైడ్, వామ్మో వీళ్లు చాలా బోల్డ్!
హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సిద్ధార్థ్ తాజాగా నటించిన ‘టక్కర్’ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ రోల్ లో కనిపించనుంది.
Takkar Teaser: టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. సిద్దార్థ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏన్నో ఏళ్లు గడుస్తున్నా ఆయన మాత్రం ఇప్పటికీ అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఏప్రిల్ 17 సిద్ధార్థ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ తాజాగా నటించిన సినిమా ‘టక్కర్’ కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ‘మజిలీ’ సినిమా ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకు సంబంధించిన టీజర్ లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్ధార్థ్ తెలుగులో చివరిగా నటించిన సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ తర్వాత తెలుగులో వస్తోన్న సిద్ధార్థ్ సినిమా ఈ ‘టక్కర్’. తాజాగా విడుదల అయిన టీజర్ రచ్చ లేపుతోంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'టక్కర్' మూవీ టీజర్ చూస్తుంటే కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఓ పేద కుటుంబంలోని యువకుడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారిద్దరి మధ్య సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామా కథలా అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. హీరోతో కలిసి హీరోయిన్ చేసిన కారు ప్రయాణం.. ఎలాంటి మలుపులు తిరిగింది? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎలా పరిష్కరించుకున్నారు వంటి అంశాలపై ఉత్కంఠ రేపేలా టీజర్ ను ఎడిట్ చేశారు. అలాగే సినిమాలో రొమాంటిక్ పాళ్లు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌కు ‘మజిలీ’ తర్వాత సరైన హిట్ రాలేదు. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, సందీప్ కిషన్ ‘మైఖేల్’ వంటి సినిమాల్లో నటించినా.. అమ్మడుకి అంతగా కలసి రాలేదు. అందుకే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచి ఈసారి ‘టక్కర్’ తో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. ఈ మూవీలో బోల్డ్ సీన్లే కాదు.. బోల్డ్ డైలాగులు కూడా బోలెడన్ని ఉన్నాయి. మరి ఈ సినిమాతో దివ్యాంశకు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.
Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్
హీరో సిద్దార్థ్ కు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అందుకే తన రాబోయే సినిమాలపై ఆశలన్నీ పెట్టుకున్నారు సిద్ధార్థ్. ఈ సినిమాతో పాటు దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ టీమ్ సిద్దార్ధ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దార్థ్ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ‘టక్కర్’ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు, మునీశ్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ తదితరులు కనిపించనున్నారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, టీ.జీ. విశ్వప్రసాద్ పేషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మించారు. ఈ మూవీను మే 26 న తెలుగులో రిలీజ్ చేయనున్నారు.