Taapsee Pannu: అడ్డుగోడలు బద్దలుకొట్టి వెలుగులోకి రండి… తన ఇస్టాగ్రామ్ వేదికగా ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన తాప్సీ
‘రశ్మీ రాకెట్’మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రత్యేకత ఏంటో తెలుసా...
టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అనే ముద్రవేసి పంపించినా బాలీవుడ్ లో మాత్రం తాప్సీకి బాగా కలిసొచ్చింది. తన అభిప్రాయాన్ని కుండబద్దల కొట్టినట్టు చెప్పే తాప్సీని దాదాపు తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టేసింది. అడపాదడపా తెలుగులో మెరుస్తున్నా లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది. అటు బీటౌన్లో మాత్రం అమ్మడిక అదృష్టం మాములుగా లేదు. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అక్కడ గోల్డెన్ లెగ్ అన్నమాట. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంపికచేసుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టూ ఎక్కుతోంది. ప్రస్తుతం `రష్మీ రాకెట్` సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది తెల్లపిల్ల. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసింది.
View this post on Instagram
మిలనో ఫ్యాషన్ వీక్ లో `వల్నరబుల్ : స్కేరీ దట్ యు డోంట్ సీ` అనే పేరుతో ఈ షార్ట్ ఫిల్మ్ ని షబీనా ఖాన్.. కుల్సుమ్ షాదాబ్ నిర్మించారు. యాసిడ్ దాడికి గురై అందవికారంగా మారిన కొంత మంది అతివల వ్యధని చూపిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు. పరదాల్లాంటి అడ్డుగోడల మధ్య నిత్యం కుమిలిపోతున్న ఎంతో మంది యాసిడ్ దాడి బాదితులు ఆ పరదాల్ని బద్దలు కొట్టి సమాజంలోకి రావాలని చెప్పే ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ తో భారత్ గర్వపడేలా చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని తాజాగా తాప్సీ ఇన్స్టా వేదికగా విడుదల చేసింది. యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త స్వేచ్ఛా యుగంలో తాము రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని భావిస్తున్నామన్నారు నిర్మాత షబినా ఖాన్ అర్సలా ఖురేషీ..జాస్ సాగు సంయుక్తంగా రూపొందించారు.
Get ready to run with Rashmi in this race on and off the track. She will need you in this one 🏃🏾♀️🚀#RashmiRocket ready to take off on 15th October 2021 only on @zee5 pic.twitter.com/spUVDap0SH
— taapsee pannu (@taapsee) September 20, 2021
ఇక తాప్సీ లేటెస్ట్ మూవీ ‘రశ్మీ రాకెట్’అక్టోబర్ 15న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. దీనిపై ప్రశంసలతో పాటూ విమర్శలూ వెల్లువెత్తాయి. తనపై వచ్చిన ట్రోల్స్ కి ఘాటుగా సమాధానం చెప్పింది తాప్సీ. ”మీ మనసులోని మాట తెలిపినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. నిజానికి ఈ దేశంలో చాలామంది మహిళలు తమ తప్పులేకపోయినా ఇలాంటి విమర్శలు రోజూ వినాల్సి వస్తోంది. మన అథ్లెట్స్ ఈ దేశం కోసం, ఆట కోసం తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తూ కూడా ఇలాంటి మాటలు పడుతున్నారు” అని తాప్సీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. మరింత వివరణ ఇస్తూ, ”ఆడతనం అనే పదాన్ని ఎవరు నిర్వచించగలరు? కండలను బట్టి వారిలో ఆడతనం ఉందో లేదో ఎలా నిర్థారిస్తారు? హార్మోన్స్ లోపం కారణంగా కొంతమంది మహిళలు తమ ప్రమేయం లేకుండానే అలా ఉంటారు. ఆ కారణంగా వారు మగవాళ్ళను తలపిస్తారు. అది తెలుసుకోకుండా విమర్శించడం సరైనది కాదు” అని ఘాటుగా బదులిచ్చింది.
Heartfelt thank you
— taapsee pannu (@taapsee) September 24, 2021
From yours Truly.
But there are many women who actually hear this daily for no fault of theirs.
An ode to all the athletes who give their sweat and blood to the sport and their nation and still get to hear this. #RashmiRocket #AbUdneKaTimeAaGayaHai pic.twitter.com/ASTJ2UdkZc
మహిళా అధ్లెట్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ‘రశ్మీ రాకెట్’ మూవీ తెరకెక్కింది. ఆడతనం లేదనే వంకతో రశ్మీ అనే అమ్మాయిపై చూపిన వివక్ష నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. తనపై వచ్చిన ఆరోపణలకు రశ్మీ ఎలా స్పందించింది? వాటిని ఎలా తిప్పికొట్టిందన్నదే ఈ చిత్రం.
Also Read: ఆకట్టుకుంటున్న అమిత్, భానుశ్రీ 'నల్లమల' టీజర్, విడుదల చేసిన దర్శకుడు దేవకట్టా
Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..