Swathi Muthyam: 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ - ఆ సినిమాలకు పోటీగా!
గణేష్ బెల్లంకొండ నటిస్తోన్న 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
గణేష్ బెల్లంకొండ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సినిమాను ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను తీర్చిదిద్దామని దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు. అయితే ఆగస్టు సెకండ్ వీక్ లో చాలా సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. సమంత 'యశోద', అఖిల్ 'ఏజెంట్', నితిన్ 'మాచర్ల నియోజకవర్గం', విశాల్ 'లాఠీ' ఇలా ఎన్నో సినిమాను ఆగస్టు రెండో వారంలోకే రిలీజ్ కాబోతున్నాయి.
ఇప్పుడు వాటితో పోటీగా దిగుతున్నాడు బెల్లంకొండ గణేష్. మరి తొలిసినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్
View this post on Instagram