Sunset Circle Awards 2022 : ఆస్కార్‌కు ముందు 'ఆర్ఆర్ఆర్'కు ఇంటర్నేషనల్ అవార్డులు - దర్శకుడిగా రాజమౌళికి...
RRR Bags Two Awards In Sunset Circle Awards 2022 : 'ఆర్ఆర్ఆర్' అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డులకు ముందు ఈ సినిమా సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో రెండు సొంతం చేసుకుంది.
'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని మన భారతీయ ప్రేక్షకులు చాలా మంది ఆశ పడుతున్నారు. తెలుగు ప్రేక్షకుల సంఖ్య అయితే చెప్పనవసరం లేదు. ఏయే కేటగిరీల్లో 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి? అనేది పక్కన పెడితే... ముందుగా నామినేషన్స్ రావాలి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందులో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటుతుండటం శుభ పరిణామం అని చెప్పుకోవాలి.
సన్‌సెట్ సర్కిల్ అవార్డ్స్‌లో
'ఆర్ఆర్ఆర్'కు రెండు!
'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు ఆ విభాగంలో మన సినిమా అవార్డులు అందుకుంటోంది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' మరో నాలుగు ఇంటర్నేషనల్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో విజేతగా నిలిచింది. అంతే కాదు... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో 'రన్నరప్'గా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'కు గాను ఆయనకు ఇది తొలి ఇంటర్నేషనల్ అవార్డు అని చెప్పవచ్చు.
Best International Feature, Winner: #RRRMovie #SCAwards pic.twitter.com/ctoIdxlZmT
— Sunset Circle Awards (@SunsetAwards) November 30, 2022
ఇంతకు ముందు కూడా 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. శాటన్ (50th Saturn Awards) పురస్కారాల్లో విజేతగా నిలిచింది. ఆ అవార్డుల్లో బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్... మూడు విభాగాల్లో నామినేషన్ లభించగా... ఒక్క అవార్డు వచ్చింది. ఇప్పుడు సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో రెండు వచ్చాయి. నెక్స్ట్ టార్గెట్ ఆస్కార్ అని, ఆ నామినేషన్స్‌కు ముందు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Also Read : ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లిపై కృతి సనన్ రియాక్షన్ ఇదే
Best Director, Runner-up: S.S. Rajamouli #RRRMovie #SCAwards pic.twitter.com/h2sHP5qJqi
— Sunset Circle Awards (@SunsetAwards) November 30, 2022
ఆస్కార్ అవార్డులకు ముందు...
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు ఎనర్జీ!
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో సినిమాను పంపలేదు. అయితే... 'ఆర్ఆర్ఆర్' అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాకుండా, ఇతర విభాగాల్లో సినిమాను నామినేట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ అవార్డులకు ముందు శాటన్ అవార్డు రావడం 'ఆర్ఆర్ఆర్' అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు.
'ఆర్ఆర్ఆర్' ఆ మధ్య జపాన్‌లో విడుదల అయ్యింది. రికార్డ్ కలెక్షన్స్ కూడా రాబట్టింది. రాజమౌళితో పాటు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ అక్కడ సందడి చేశారు. ఆ సమయంలో శాటన్ అవార్డు వచ్చింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూళ్లు రికార్డులు మాత్రమే కాదు... భారతీయ, విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. హాలీవుడ్ దర్శక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ 'ఆర్ఆర్ఆర్' అద్భుతమని ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు. ప్రశంసలకు తోడు ఇప్పుడు అవార్డులు కూడా వస్తున్నాయి.