Sunny Leone : సన్నీ లియోన్‌కు వినపడటం లేదు, మాటలు కూడా రావడం లేదు!
విష్ణు మంచు (Manchu Vishnu) లేటెస్ట్ సినిమా 'జిన్నా'లో సన్నీ లియోన్ ఓ నాయికగా నటించారు. రెగ్యులర్ టైప్ గ్లామర్ రోల్ కాకుండా ఇందులో ఆవిడ డిఫరెంట్ రోల్ చేశారు.
సన్నీ లియోన్ (Sunny Leone) కు ఏం చెప్పినా వినపడటం లేదు! అది పక్కన పెడితే... ఆమె తిరిగి మాట్లాడం కూడా లేదు. ఆమెకు మాటలు రావడం లేదు! ఏంటిది? అంటే... ఇది రీల్ లైఫ్‌లో మాత్రమే, రియల్ లైఫ్‌లో కాదులెండి.
విష్ణు మంచు (Manchu Vishnu) కథానాయకుడిగా నటించిన 'జిన్నా' (Ginna Movie) లో సన్నీ లియోన్ ఓ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె రేణుక పాత్రలో కనిపించనున్నారు. రేణుక చెవిటి, మూగ మహిళ. అదీ సంగతి! 'జిన్నా'లో సన్నీ లియోన్ డెఫ్ అండ్ డంబ్ రోల్ చేశారు. ఈ పాత్ర చేయడం తనకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆమె తెలిపారు.
'జిన్నా' సినిమా గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ ''తెలుగులో నేను నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా 'జిన్నా'. లాక్ డౌన్ టైమ్‌లో నాకు ఈ కథ చెప్పారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. నాకు ఇటువంటి కథలు అంటే ఇష్టమే. అందువల్ల, వెంటనే ఓకే చెప్పాను. 'జిన్నా' షూటింగ్ టైమ్‌లో విష్ణు, నేను కొన్ని ఫ్రాంక్ వీడియోస్ చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విష్ణు ఎనర్జీటిక్ పర్సన్. తనతో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంది. షూటింగ్ కోసం వచ్చినప్పుడు నాకు విష్ణు ఫ్యామిలీ చక్కటి హాస్పిటాలిటీ కల్పించారు'' అని చెప్పారు. 'జిన్నా' సినిమా అందరికీ నచ్చుతుందని ఆవిడ ఆశాభావం వ్యక్తం చేశారు.
విష్ణు మంచు, సన్నీ లియోన్ మీద తెరకెక్కించిన 'జారు మిఠాయి' పాటకు రెస్పాన్స్ బావుంది. పాట మాత్రమే కాదు, సినిమాలో ఇద్దరిపై ఫైట్ కూడా ఉందని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
నెగిటివ్ కామెంట్స్ చదవను!
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి కూడా సన్నీ లియోన్ స్పందించారు. ''నేను నెగిటివ్ కామెంట్స్ చదవను. పాజిటివ్ కామెంట్స్ మాత్రమే చదువుతా. ముందుకు వెళతా. సోషల్ మీడియాలో ట్రోల్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ నా ఒక్కరికి మాత్రమే కాదు... ప్రతి ఒక్కరికీ వస్తాయి'' అని సన్నీ లియోన్ తెలిపారు. ప్రస్తుతం తాను నటించిన నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయని ఆవిడ తెలిపారు. హిందీలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో డీ గ్లామర్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో ఆవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై సినిమా రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ, కోన వెంకట్ స్క్రిప్ట్ అందించారు. కోన క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.
View this post on Instagram