Aham Reboot: 'అహం రీబూట్' - సుమంత్ ఫస్ట్ లుక్
'అహం రీబూట్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
సుమంత్ హీరోగా నటిస్తున్న 'అహాం రీబూట్' ఫస్ట్ లుక్ ని రచయిత విజయంద్ర ప్రసాద్ గారు లాంఛ్ చేశారు. ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్న 'అహం రీబూట్' సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్.. సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందించబోతున్నామని.. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహాం రీబూట్ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జైట్మెంట్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు.
Also Read: ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు - స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
View this post on Instagram