అన్వేషించండి

CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం

High drama in Punjab assembly : పంజాబ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనకు తక్షణమే ఆల్కహాల్ టెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

Opposition demands  alcohol test on CM Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం నాడు ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో  సభకు వచ్చారంటూ విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఆరోపించడమే కాకుండా, ఆయనకు తక్షణమే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష  నిర్వహించాలని డిమాండ్ చేయడంతో సభ అట్టుడికిపోయింది.   

మద్యం తాగినట్లుగా సీఎం మాన్ ప్రవర్తన

పంజాబ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవర్తనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. సీఎం మద్యం సేవించి సభకు వచ్చారని, ఆయనకు తక్షణమే ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, ఆప్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి పరస్పర నినాదాలతో హోరెత్తించడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

 అది ప్రజాస్వామ్య దేవాలయానికి అవమానం 

ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా స్పీకర్‌కు రాసిన లేఖలో ముఖ్యమంత్రి ప్రవర్తన  తీవ్ర అభ్యంతరకరం గా ఉందని పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండానే ముఖ్యమంత్రి బయటకు వెళ్లిపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.  ముఖ్యమంత్రితో సహా సభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ డోప్ టెస్ట్, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ప్రవర్తనను అనుమతిస్తే ప్రజల్లో సభపై ఉన్న గౌరవం పోతుంది అని బాజ్వా హెచ్చరించారు. 

 ఫ్లోర్ టెస్ట్ కంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ముఖ్యం 

పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా విపక్షాల డిమాండ్‌కు మద్దతు పలికారు.  గురుద్వారాలు లేదా దేవాలయాల్లోకి ఎవరైనా మద్యం సేవించి వెళ్తే అది ఎంత పెద్ద అపరాధమో, అసెంబ్లీలోకి మద్యం మత్తులో రావడం కూడా అంతే పెద్ద నేరం. ఈరోజు ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్ చేయడం కంటే, సభ్యులందరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడం ముఖ్యం. అది చేస్తే అసలు ఫ్లోర్ టెస్ట్ అవసరమే ఉండదు  అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ నేతలు ఆరోపించారు.

 ఆరోపణలను కొట్టిపారేసిన ఆప్ 

విపక్షాల ఆరోపణలపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ  తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ నిరాధారమైన, హాస్యాస్పదమైన ఆరోపణలని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు, మంత్రి అమన్ అరోరా మండిపడ్డారు. సభలో చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆప్ నేతలు పేర్కొన్నారు.  విపక్షాల ఆందోళనల మధ్యే మాన్ ప్రభుత్వం సభలో విశ్వాస తీర్మానాన్ని  ప్రవేశపెట్టింది. కాగా, డోప్ , బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలన్న విపక్షాల విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు.    

టాప్ హెడ్ లైన్స్

Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget