Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. 238.09 స్ట్రైక్ రేట్‌తో బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి బౌలర్లనే భయపెడుతున్న వైభవ్ ఆటతీరు చూసి ప్రపంచం కూడా షాక్ అవుతుంది.
వైభవ్ బ్యాటింగ్‌ను చూసిన పాకిస్థాన్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఈ అబ్బాయి గేమ్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అతని శరీరంలోనో లేదా బ్యాట్‌లోనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ఉండాలి ఉండాలి. డోపింగ్ టెస్ట్ చేసినట్లుగా ఇతడిని ఏదైనా ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి" అన్ని అన్నారు. 18 ఏళ్లు కూడా నిండకుండా ఇలాంటి షాట్లు ఆడటం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
నౌమాన్ నియాజ్ చేసిన ఈ 'ఏఐ చిప్' వ్యాఖ్యలపై వైభవ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. "ఆ చిప్‌ను దేవుడే స్వయంగా నా బ్యాట్‌కు అమర్చి పంపాడు. నేను పుట్టకముందే దేవుడు నా బ్యాట్‌లో ఒక ప్రత్యేక శక్తిని పెడుతున్నానని చెప్పాడు, ప్రస్తుతం నేను దాన్నే వాడుతున్నాను" అని నవ్వుతూ బదులిచ్చాడు. వైభవ్ ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















