Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?
Ambajipeta Marriage Band: సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రబృందం.
Ambajipeta Marriage Band Release Date: ‘కలర్ ఫోటో’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు నటుడు సుహాస్. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. ‘హిట్ 2’ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే అమ్మాయిలను దారుణాతి దారుణంగా హత్య చేసే సైకో కిల్లర్ పాత్రలో ఒళ్లు గగుర్పొడిచేలా నటించాడు. తాజాగా సుహాన్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరి 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శివానీ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘గుమ్మా సాంగ్’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సుహాస్ హెయిర్ సెలూన్ లో ఓ వ్యక్తికి గుండు చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనిలో పనిగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
The Intense & Hard-hitting tale of 'Malligadu' is all set to unveil itself on the Big Screens 🔥🥁#AmbajipetaMarriageBand GRAND RELEASE WORLDWIDE ON 2nd FEBRUARY, 2024 ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/z2dfP3Zm6Q
— GA2 Pictures (@GA2Official) December 26, 2023
#AmbajipetaMarriageBand GRAND RELEASE WORLDWIDE ON 2nd FEBRUARY, 2024 ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra #Rahman @ashishtejapuala @GA2Official @Mahayana_MP @SonyMusicSouthpic.twitter.com/5xkOQJZTdE
— BA Raju's Team (@baraju_SuperHit) December 26, 2023
ఆకట్టుకున్న మూవీ టీజర్
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ టీజర్ లో సుహాస్ ఓ వైపు హెయిర్ కటింగ్ షాప్ నడిపిస్తూనే, మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో పని చేస్తాడు. శివానీతో ప్రేమలో పడే యువకుడిగా ఫన్నీగా నటించాడు. అదే సమయంలో పలు సీరియస్ సన్నవేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్ల మధ్య సరదా లవ్ ట్రాక్‌తో సాడే ‘గుమ్మా సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది. అటు మేకింగ్ వీడియో కూడా సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. మొత్తంగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా హీరో హీరోయిన్ల ఫన్నీ లవ్ ట్రాక్ తో పాటు పలు ఎమోషనల్‌గా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ‘పుష్ప’ ఫేం జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Read Also: తప్పు నాదే వీలైతే క్షమించు, బాలీవుడ్ బ్యూటీకి ‘యానిమల్’ డైరెక్టర్ క్షమాపణలు