అన్వేషించండి

SS Rajamouli: ఇండియన్ సినిమాపై రాజముద్ర - దేశం గర్వించే స్థాయికి చేరిన ఎస్ఎస్ రాజమౌళి!

SS Rajamouli తెలుగు సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. Bahubali నుంచి RRR వరకూ దేశం మొత్తం తన సినిమా బజ్ క్రియేట్ చేస్తున్న దర్శక ధీరుడి స్పెషల్ క్వాలిటీస్ ఏంటి?

ఒకప్పుడు మాస్ సినిమాలే వర్కౌట్ అవుతాయని నమ్మిన ఆ డైరెక్టర్....ఇప్పుడు కోర్ ఎమోషన్ కి కట్టుబడి సినిమాలు చేస్తున్నాడు. ఓ టైంలో అడల్ట్ కంటెంటే ప్రేక్షకుడిని సీట్లలో కూర్చోబెడుతుందని నమ్మిన ఆ వ్యక్తి...ఇప్పుడు సీజీ మ్యాజిక్కుల గ్రాండియర్ తో మాగ్నం ఓపస్ లు క్రియేట్ చేస్తున్నాడు.  రీజియన్ల బ్యారియర్లు బద్ధలు కొట్టి....ప్యాన్ ఇండియా సినిమాకి అసలైన నిర్వచనం చెబుతున్నాడు. అయితే బాలీవుడ్ లేదా మల్లువుడ్ అంటూ హిందీ, మలయాళం చుట్టూ తిరిగిన సినిమాల బజ్ ను తెలుగు రాష్ట్రాల కు ఆపాదించి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన దర్శకుడు ఆయన. సినిమా అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఎస్ఎస్ రాజమౌళి.

శాంతి నివాసం సీరియల్ నుంచి...ఆర్ఆర్ఆర్ గ్రాండియర్ వరకూ రాజమౌళి బలంగా నమ్మేది ఎమోషన్. సరైన సమయంలో సీన్ ఎలివేట్ చేసేలా పడే ఆ ఎమోషన్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే చాలు...సినిమా హిట్ టాక్ రావటం పక్కా. ఈవిద్యలో జక్కన్న ను మించిన వాళ్లు లేరేమో. అసలు జూ ఎన్టీఆర్....రాజమౌళిని జక్కన్న అని పిలిచేదే అందుకు. ఓ శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు....సీన్ ను ఎమోషన్ తో కనెక్ట్ చేసి ఆడియన్స్ హార్ట్ పల్స్ ను పెంచటం రాజమౌళికి  బాగా ఇష్టమైన పని. అందుకే రాజమౌళి సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింస్ గా నిలబడగలుగుతున్నాయి.

రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ప్రధానంగా నాలుగు విషయాల మీద డిస్కస్ చేయొచ్చు.

మొదటిది టెర్రిఫిక్ టేకింగ్...ది స్కల్ ప్చర్

ఈగ లాంటి సినిమాలకు తప్ప మ్యాగ్జిమం రాజమౌళి సినిమాల కథలను రాసేది ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్. సో వాళ్ల నాన్న రాసిన పాత్రలను వాటి తీరును ఊహించుకుని...వాటిని సిల్వర్ స్క్రీన్ పై  గుర్తిండిపోయే పాత్రల్లా తీర్చిదిద్దటం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. ప్రీ పొడక్షన్ స్టేజ్ లోనే సినిమాలోని ప్రతి సీన్ పై పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చేస్తాడు జక్కన్న. పాత్రకు ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉండాలి. సెట్స్ ఎలా ఉండాలి. సీజీ ఎలా చేయించాలి. షూటింగ్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇలా ప్రతీ అంశంపైన కంప్లీట్ క్లారిటీతో ఉంటాడు కాబట్టే.....రాజమౌళి సినిమాలో సీన్లు అంత ఫర్ ఫెక్ట్ గా వర్కవుటవుతాయి. యాక్టర్స్ తో స్టోరీ సిట్టింగులు పెట్టి మరీ  రాసుకున్న కథకు తగ్గట్లుగా నటుల నుంచి ఎలాంటి ఫ ర్ ఫార్మెన్స్ రాబట్టాలి అనే విషయంలో రాజమౌళికి ఉన్న స్పష్టత ఎవరికీ ఉండదమో..అందుకే రోజుకు నాలుగు సీన్లు ఉన్నా తను అనుకున్నట్లుగా వచ్చే వరకూ షెడ్యూల్ ఎక్స్ టెంట్ చేస్తుంటాడాయన. ఒక్కో సినిమా కనీసం రెండేళ్ల సమయం పట్టడానికి కూడా ఇదే కారణం. కానీ ఫ్లాస్ ఉన్నా అసలే మాత్రం ఐడింటిఫై కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫరెక్షన్ తో ఔట్ పుట్ తీసుకువచ్చి థియేటర్లో కూర్చుని సినిమాను చూస్తున్న ఆడియెన్స్ మెస్మరైజ్ చేస్తాడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాలు కంప్లీట్ అయ్యాయంటే ఎంత హార్డ్ వర్క్ అండ్ విజన్ ఉండాలి ఆ డైరెక్టర్ కి. 

రెండు మాస్టర్ స్టోరీ టెల్లర్
రాజమౌళి సినిమాల్లో కోర్ ఎమోషన్ బలంగా ఉంటుంది. రొమాన్స్, రివేంజ్, మ్యూజిక్ అంటూ రకరకాల టాపింగ్స్ సినిమాకు ఉన్నా...బలమైన కోర్ ఎమోషన్ ను త్రూ అవుట్ సినిమా డీల్ చేస్తాడు రాజమౌళి. సినిమా స్క్రీన్ ప్లే డల్ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఓ గూస్ బంప్స్ సీన్ తీసుకువచ్చి పెట్టి ఆడియెన్స్ ఎమోషన్ ను రైజ్ చేస్తాడు. స్టూడెంట్ నెంబర్ 1లో జైలు నుంచి వచ్చి చదువుకుంటున్నానని తారక్ చెప్పే సీన్, సింహాద్రిలో సింగమలై ఎలివేషన్ సీన్లు, సైలో రగ్బీ ఫైట్, విక్రమార్కుడులో ఇంటర్వెల్ బ్యాంగ్, మగధీరలో వంద మందితో యుద్ధం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా. రాజమౌళికి ఫ్లాఫ్ లేని డైరెక్టర్ అనే పేరు ఊరికి రాలేదు మరి. ఇంత బలంగా కథ చెబుతాడు కాబట్టే....ఆయన సక్సెస్ రేట్ అంతలా ఉంది.

మూడు సీజీ కా బాప్, సెట్ క్రియేషన్ లో తోప్
ఛత్రపతి సినిమాలో హీరో ఉండే ఏరియా, మగధీరలో రాజభవంతులు, ఇక బాహుబలిలో అయితే మాహిష్మతి సామ్రాజ్యం...సినిమాలో కళ్లు తిప్పుకోవటానికి స్పేస్ కూడా ఇవ్వడు జక్కన్న. అంతటి భారీ సెట్ లను మన ముందు పిన్ పాయింట్ డీటైల్స్ తో ఆవిష్కరించి గ్రాండియర్ అన్నపదానికి కేరాఫ్ అడ్రస్ లా నిలుస్తాడు రాజమౌళి. తమిళంలో శంకర్, హిందీలో సంజయ్ భన్సాలీ కి ఏ మాత్రం తగ్గకుండా విజువల్స్ క్రియేట్ చేస్తాడు కాబట్టే ఆ దిగ్గజ దర్శకుల స్థాయిలో నిలబడగలిగాడు మన జక్కన్న. 

నాలుగు మార్కెటింగ్
పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ మొదల్యయాక రాజమౌళి దేశవ్యాప్తంగా తెలుస్తున్నారు కానీ...అంతకు ముందు విడుదలైన  మగధీర, ఈగ లాంటి సినిమాలు కూడా  నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీన్ అయ్యాయి అంటే...అర్థం చేసుకోవచ్చు రాజమౌళి ఫాలో అప్ ఎలా ఉంటుందో. బాహుబలి సిరీస్ తో మొత్తం ప్యాన్ ఇండియా టార్గెట్ చేసిన ఎస్ఎస్ఆర్...హిందీలో ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ తో...తమిళ్, కన్నడలోనూ టాప్ మోస్ట్ డిస్టిబ్యూటర్ లు, ఎగ్జిబిటర్స్ తో టై అప్ అయ్యి ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేయించాడు రాజమౌళి. బిగ్ బాస్ హౌజ్ లకు వెళ్లటం దగ్గర నుంచి కామెడీ విత్ కపిల్ శర్మ ల వరకూ....రాజమౌళి అండ్ టీం వాళ్ల సినిమాను ప్రమోట్ చేయటం ఓ సాధారణ విషయంలా మారిపోయింది. ఆర్ఆర్ ఆర్ కై తే ఆ ఫస్ట్ ఫేజ్ లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల ను చుట్టేసిన టీం....కరోనా కారణంగా వాయిదాపడినా ఇప్పుడు అంతకు మించిన ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్నారు. ఓ తెలుగు సినిమా డైరెక్టర్, హీరోలు యాక్ట్ చేసిన సినిమా చిక్ బళ్లాపూర్ లోనో, అమృత్ సర్ లోనూ ప్రమోషన్స్ చేస్తుందని ఎవరైనా ఊహించారా అదీ రాజమౌళి అంటే. సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ తో సగం బడ్జెట్ లాగేయటం జక్కన్న ట్రేడ్ మార్క్ సీక్రెట్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
PM Surya Ghar Muft Bijli Yojana Online Apply: కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
Goli Shyamala: సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
Embed widget