News
News
X

Bigg Boss Telugu 6: 'బయట పేర్లు తీయొద్దు' - ఇనయాకి వార్నింగ్ ఇచ్చిన శ్రీహాన్!

ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఎన్నుకోమని చెప్పారు బిగ్ బాస్. దీంతో చాలా మంది హౌస్ మేట్స్ గీతూని టార్గెట్ చేశారు.

FOLLOW US: 

'బిగ్ బాస్' సీజన్ 6(Bigg Boss)లో రచ్చ మొదలైంది. హౌస్‌లో ఉన్న 21 మంది కంటెస్టెంట్ల మధ్య అప్పుడే గొడవలు మొదలైపోయాయి. హౌస్ లో అడుగుపెట్టిన తొలిరోజే నామినేషన్స్ తో రచ్చ మొదలుపెట్టారు బిగ్ బాస్.బుధవారం వెల్లడించిన నామినేషన్ల ప్రకారం.. చంటి, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, అభినయాశ్రీ, శ్రీసత్య, ఆరోహీలు ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. శనివారం జరగబోయే ఎలిమినేషన్లలో వీరిలో ఒకరు లేదా ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి హౌస్ లోకి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ని పెట్టారు. సో.. బిగ్ బాస్ ఎప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడతారో అనే టెన్షన్ కంటెస్టెంట్స్ లో ఉండడం ఖాయం. 

ఇదిలా ఉండగా.. ఈరోజు షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. మొదటి ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ మొదలైనట్లు చూపించారు. నీటిలో తాళాలు వేసి చేతితో కాకుండా నోటితో తియాలని ఆదేశించారు బిగ్ బాస్. 'కెప్టెన్సీ బండి' టాస్క్ కింద కాస్త టఫ్ ఫైటే ఇచ్చాడు బిగ్ బాస్. చేతుల సాయం లేకుండా నీటి తొట్టెలో ముఖం పెట్టి తాళాలు తీయాలనేది ఒక టాస్క్. ఆ తర్వాత ఆ తాళం చేతులకు తగిన పెట్టెను వెతికి.. దాన్ని తెరవాలి. ఈ టాస్క్‌కు ఫైమా సంచాలకురాలిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ టాస్క్‌లు బాలాదిత్య హౌస్‌కు మొదటి కెప్టెన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

కాసేపటి క్రితం విడుదల చేసిన రెండో ప్రోమోలో.. హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ వారం హౌస్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో ఎన్నుకోమని చెప్పారు. దీంతో చాలా మంది హౌస్ మేట్స్ గీతూని టార్గెట్ చేశారు. హౌస్ లో ఆమె చేసే అతిని రీజన్ గా చెప్పారు. వచ్చిన వారంలోనే అందరితో గొడవ పెట్టుకుందని.. ఆమెతో లాంగ్ జర్నీ కష్టమని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఇనయాకు.. శ్రీహాన్ కి మధ్య గొడవైంది. తను సోలోగా హౌస్ లోకి వచ్చానని.. సోలోగా గేమ్ ఆడుతున్నానని.. నీకు బయట సిరి.. ఇంకా చాలా మంది ఉన్నారని శ్రీహాన్ పై కామెంట్స్ చేసింది ఇనయా. దీంతో అతడికి కోపం వచ్చి.. వేలు చూపిస్తూ 'బయట పేర్లు తీయొద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా ఇనయా తగ్గలేదు. 'నువ్ అందరితో మంచిగా ఉంటూ సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నావ్' అంటూ ఫైర్ అయింది. 

Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?

Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 09 Sep 2022 08:46 PM (IST) Tags: Inaya Sultana Srihan Bigg Boss 6 Bigg Boss Telugu 6

సంబంధిత కథనాలు

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi October 6th: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Guppedantha Manasu October 6th Update: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Karthika Deepam October 6th Update: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!

Devatha October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

Devatha  October 6th Update: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

టాప్ స్టోరీస్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?