By: ABP Desam | Published : 11 Jan 2022 05:51 PM (IST)|Updated : 11 Jan 2022 05:54 PM (IST)
జాన్వీ కపూర్, ఖుషి కపూర్
జనవరి తొలి వారంలో తాను, తన సోదరి ఖుషి కరోనా బారిన పడ్డామని శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన తొలి రెండు రోజులు భారంగా గడిచిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత ప్రతి రోజూ కొంత కొంత మెరుగు అయ్యిందని పేర్కొన్నారు. వైరస్ నుంచి మనల్ని రక్షించుకోవడానికి ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించడమేనని ఆమె తెలిపారు. బిఎంసి (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) సూచించినట్టు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నామని, ఇప్పుడు తామిద్దరికీ నెగెటివ్ వచ్చిందని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.
జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కంటే ముందు... శ్రీదేవి సవతి సంతానం, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు - బాలీవుడ్ హీరో అర్జున కపూర్, కుమార్తె అన్షులా కపూర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే... వాళ్ల కజిన్ రియా కపూర్, ఆమె భర్త కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు కపూర్ కజిన్స్ అందరూ కరోనా ఫ్రీగా తేలారు.
ఇక, సినిమాలకు వస్తే... 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. న్యూ యార్క్ నగరంలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్న ఖుషి కపూర్, త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
Also Read: వాసివాడి తస్సాదియ్యా... 'బంగార్రాజు' ట్రైలర్ అదిరిందయ్యా!
Also Read: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?
NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
First Day First Show: 'జాతి రత్నాలు' కేవీ అనుదీప్ కథతో...
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకటేష్, వరుణ్ తేజ్ సల్సా - 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ప్రోమో చూశారా?
VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?
PM Modi in Nepal: నేపాల్ పర్యటనలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన