Sreeleela: టాలీవుడ్ లో శ్రీలీల జోరు, మెగా ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ?
కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే 9 సినిమాలకు సైన్ చేయగా, తాజాగా మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల తెలుగు సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు, ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటన, డ్యాన్స్ కు ప్రేక్షకులతో పాటు మేకర్స్ సైత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే 9 సినిమాలకు సైన్ చేసింది. ఇవన్నీ బడా ప్రాజెక్టులే కావడం విశేషం. మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.
శ్రీలీలకు మెగా మూవీలో ఛాన్స్!
తాజాగా శ్రీ లీలకు మరో అదిరిపోకే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత, తన కూతురు సుస్మిత బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు డీజే టిల్లు హీరో జొన్నలగడ్డ సిద్ధు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
డీజే టిల్లుతో శ్రీలీల జోడీ
ఈ సినిమాలో శ్రీలీల సిద్ధుకు జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, శ్రీ లీల ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, కారణాలు బయటకు తెలియకపోయినా, తనను కాదని అనుపమ పరమేశ్వరన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఎలాగైతేనేం, శ్రీ లీలతో కలిసి సిద్ధు స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అదీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. అటు శ్రీలీల సైతం చిరంజీవి సినిమాలో అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్ద హీరోలతో శ్రీలీల వరుస సినిమాలు
ఇప్పటికే బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ పోతినేని, నవీన్ పొలిశెట్టి, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా శ్రీలీల కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు నాలుగైదు దాకా ఉన్నాయి. మరికొన్ని అగ్రీమెంట్ కావల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలీల అంగీకరించిన సినిమాలన్నీ షూటింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆమె కాల్ షీట్స్ ఖాళీగా లేవు. మొత్తంగా ఒక్కటే శ్రీలీల.. తొమ్మిది బడా సినిమాలు. స్టార్ హీరోలకు కూడా లేనన్ని పెద్ద ప్రాజెక్టుల్లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ తొమ్మిది సినిమాల్లో కనీసం 5 హిట్లు కొట్టినా, శ్రీలీలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం.
View this post on Instagram
Read Aslo: వరుస సినిమాలతో పవన్ బిజీ, ‘హరిహర వీరమల్లు’ అనుకున్న సమయానికి విడుదలయ్యేనా?