Sreeleela: తెలివిగా తప్పించుకున్న శ్రీలీల, తమన్ ఎంతడిగినా కుర్చీ మడత పెట్టలేదు!
Sreeleela denies Thaman request: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమన్, శ్రీ లీల మధ్య ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బలవంతం చేసినా సరే... శ్రీలీల కుర్చీ మడత పెట్టలేదు.
Sreeleela not interested to sing Kurchi Madatha Petti: యంగ్ హీరోయిన్ శ్రీలీల మంచి డాన్సర్. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటల్లో ఏ రేంజ్‌లో స్టెప్పులు వేస్తున్నారో ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీ లీల డ్యాన్స్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. శ్రీ లీలతో డ్యాన్స్ అంటే హీరోలకు తాట ఊడిపోతుందని సరదాగా వ్యాఖ్యానించారు.
'కుర్చీ మడతపెట్టి...' పాటలో శ్రీ లీలకు ధీటుగా మహేష్ బాబు స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ వైరల్ అవుతోంది. శ్రీ లీలలో మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు... సింగర్ కూడా ఉన్నారు. ఆ విషయం సంగీత దర్శకుడు తమన్ (Thaman)కు తెలుసు. శ్రీ లీల నటించిన 'స్కంద', 'భగవంత్ కేసరి' సినిమాలకు ఆయన సంగీత దర్శకుడు. 'స్కంద' ప్రీ రిలీజ్ వేడుకలో ఆమెతో స్టేజి మీద 'నీ చుట్టు చుట్టు...' పాట పాడించారు కూడా! సేమ్ ఫీట్ మళ్ళీ రిపీట్ చేయాలని తమన్ ట్రై చేశారు. కానీ, శ్రీ లీల ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
శ్రీ లీల 'కుర్చీ మడతపెట్టి...' పాడలేదు
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో స్టేజిపై శ్రీ లీల 'కుర్చీ మడతపెట్టి...' పాట పాడుతుందని అనౌన్స్ చేశారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం అసలు పాడలేదు. 'కూ కూ కూ...' అని ముందు వచ్చే లైన్ హమ్ చేశారు తప్ప... పాడటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
నార్త్ ఇండియన్ అమ్మాయి ఎవరైనా అయితే 'కుర్చీ మడతపెట్టి...' పాటను ఈజీగా పాడేవారు ఏమో!? శ్రీ లీల తెలుగు అమ్మాయి. ఆమెకు తెలుగు స్పష్టంగా వచ్చు. 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో... మహేష్ లాంటి స్టార్ హీరో, సాహిత్యానికి విలువ ఇచ్చే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఎవరో ముసలాయన యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బూతు మీద పాట చేయడం ఏమిటి? అని విమర్శలు కూడా చేస్తున్నారు.
'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ స్టోరీ శ్రీ లీలకు తెలుసు. ఆ సాంగ్ మీద వస్తున్న ట్రోల్స్ కూడా చూసే ఉంటారు. అందుకే ఏమో? చాలా తెలివిగా తమన్ రిక్వెస్ట్ నుంచి శ్రీ లీల తప్పించుకున్నారు. 'కు కు కు' అంటూ హమ్ చేసి వచ్చారు. ఆ తర్వాత డ్యాన్స్ పెర్ఫార్మన్స్ టైంలో స్టేజి మీదకు వెళ్లి రెండు స్టెప్పులు వేసి వచ్చారు.
Also Read: డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'సైంధవ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి - ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
దిల్ రాజు సైతం శ్రీ లీల డ్యాన్స్ గురించి
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాదు... ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం శ్రీ లీల డ్యాన్స్ గురించి మాట్లాడారు. అయితే... శ్రీ లీల ఈ 'గుంటూరు కారం' తనకు రీ లాంచ్ అని భావిస్తున్నారు. దీనికి ముందు ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్, త్రివిక్రమ్ కాంబో మీద నమ్మకం పెట్టుకున్నారు. సినిమాకు విపరీతమైన బజ్ నెలకొనడంతో భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనబడుతోంది.