అన్వేషించండి

Anil Ravipudi: ప్రతి పంచ్‌కి నవ్విన అనిల్ రావిపూడి - రెండు గంటలు నాన్ స్టాప్ నవ్విస్తామన్న సంజయ్!

Sound Party movie pre release event : 'బిగ్ బాస్' సన్నీ హీరోగా నటించిన 'సౌండ్ పార్టీ' ప్రీ రిలీజ్ వేడుకకు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

''బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చినప్పట్నుంచి సన్నీ (Bigg Boss 5 Telugu winner Sunny) బాగా కష్టపడుతున్నాడు. మంచి సినిమాలు చేస్తున్నాడు. 'సౌండ్ పార్టీ' ట్రైలర్ బావుంది. అందులో ప్రతి పంచ్‌కి నవ్వాను'' అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. 'బిగ్ బాస్' సీజన్ 5 విజేత వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన సినిమా 'సౌండ్ పార్టీ' (Sound Party Movie). ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన చిత్రమిది. సంజ‌య్ శేరి దర్శకుడు. ఈ నెల 24న థియేటర్లలో విడుదల అవుతోంది. 

'సౌండ్ పార్టీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Sound Party pre release event)కు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ''ఇటీవల నేను ఇంత నవ్వుకున్న ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య సీన్లు బాగా ఫన్నీగా ఉంటాయని అర్థం అవుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా 'సౌండ్ పార్టీ' ఉంటుంది'' అని చెప్పారు. సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. దర్శకులు వియన్ ఆదిత్య, హీరో చైతన్య రావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు కెఎల్ దామోదర్ ప్రసాద్ ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నాని, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, 'హైపర్' ఆది వీడియో బైట్స్ ద్వారా అభినందనలు తెలియజేశారు.

Also Read : మన్సూర్‌ది వక్రబుద్ధి... త్రిషకు అండగా మెగాస్టార్ చిరంజీవి

వీజే సన్నీ మాట్లాడుతూ... "మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మా 'సౌండ్ పార్టీ' తరఫున థాంక్స్. నేను యాక్టర్ కావాలని కలగనే మా అమ్మ కళావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి నటీనటులు, సాంకేతిక తారాగణంతో ఈ సినిమా రూపొందింది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి శివన్నారాయణ లాంటి డాడీ ఉంటే బావుంటుందని అనిపిస్తుంది'' అన్నారు. శివన్నారాయణ మాట్లాడుతూ... "సంజయ్ పదేళ్ల క్రితం నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్ర రాశారు. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. అశ్లీలత ఉండదు. 'అమృతం'లో నన్ను చూసిన మీరు ఎలా అయితే ఆదరించారో... ఈ చిత్రాన్ని అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని అన్నారు. 

రెండు గంటలు నవ్విస్తుందీ సినిమా - సంజయ్
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ... "సినిమాకు రియల్ సౌండ్ పార్టీ మా నిర్మాతలే. రెండు గంటల పాటు కంటిన్యూగా నవ్విస్తుందీ సినిమా. సన్నీ ఎనర్జిటిక్ హీరో. మా టీమ్ సపోర్ట్ చేయడంతో సినిమా అనుకున్న విధంగా వచ్చింది. శివ కార్తికేయన్ గారితో సినిమా చేయాలని ఉంది. అని నాకు అవకాశం ఇస్తే స్టోరీ వినిపిస్తా" అని అన్నారు. సంజయ్ రైటింగ్ స్టైల్ త్రివిక్రమ్ తరహాలో ఉంటుందని నిర్మాత రవి పోలిశెట్టి అన్నారు. నిర్మాత మహేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానిక్, బిగ్ బాస్ ఫేమ్ కాజల్, లిరిసిస్ట్ పూర్ణాచారి, నటీనటులు అమీద, లోబో, టేస్టీ తేజ, శుభ శ్రీ కార్యక్రమానికి హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు. 

Also Read త్రిషకు ఆ తమిళ స్టార్ హీరో లాంటి భర్త కావాలట - పెళ్లి గురించి ఏమంటున్నారో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget