అన్వేషించండి

Soul Of Varasudu: ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ - మనసుకు హత్తుకొనేలా అమ్మ పాట, మైమరపిస్తున్న సింగర్ చిత్ర గాత్రం

తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు మూవీ టీమ్. ‘సోల్ ఆఫ్ వారసుడు’ పేరుతో విడుదల అయిన అమ్మపాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

మిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతాయి. ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈసారి డైరెక్టు తెలుగు సినిమాలో నటిస్తున్నాడు విజయ్. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీలోని ‘సోల్‌ ఆఫ్ వారసుడు’ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాటను ప్రముఖ సింగర్ చిత్ర ఆలపించారు. ‘అమ్మమ్మో నేనేమి వింటినమ్మా.. వాకిల్లి నిలిచింది వాస్తవమా..’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.  ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించారు. థమన్ సంగీతం అందించారు.  

ఇప్పటికే ‘వారసుడు’ సినిమా నుంచి ‘రంజితమే’, ‘ది దళపతి’ పాటలను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక మూవీ నుంచి మూడోొ పాటగా ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ వింటుంటే సినిమాలో ఈ పాటే ప్రధాన ఆకర్షణగా కనిపించనుందని తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ తో సాగే ఈ పాటలో లిరిక్స్ కూడా మనసును హత్తుకునేలా ఎమోషనల్ గా రాశారు రామజోగయ్య. ఇక థమన్ మ్యూజిక్ తో పాటను వేరే లెవల్ కు తీసుకెళ్లారు. మొత్తంగా ఈ పాటతో ‘వారసుడు’ సినిమాపై మరింత ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి టీజర్, ట్రైలర్ లు విడుదల కాలేదు. అయినా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకే మూవీ టీమ్ కూడా హడావిడి లేకుండా మెల్లగా ఒక్కో అప్డేట్ ను రివీల్ చేస్తూ వస్తున్నారు. 

ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డాడు హీరో విజయ్. ఆయన నటించిన ‘తుపాకీ’ సినిమా నుంచి ‘విజిల్’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ సినిమాల వరకూ చాలా సినిమాలు తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో తెలుగులోనూ విజయ్ మార్కెట్ బాగానే పెరిగింది. అందుకే ఈసారి తెలుగు దర్శక నిర్మాతలతో కలసి పనిచేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారాయన. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రెండు పాటలు విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. త్వరలోనే సినిమా టీజర్, ట్రైలర్ కూడా విడుదల చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ‘వారసుడు’ అభిమానులు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget