By: ABP Desam | Updated at : 10 May 2022 01:26 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
బాలీవుడ్ లో పెళ్లిళ్ల కాలం నడుస్తోంది. కత్రినా, అలియాల పెళ్లి తరువాత ఇప్పుడు సోనాక్షి సిన్హా వివాహం గురించి చర్చలు మొదలయ్యాయి. ఆమె ఇన్ స్టాలో చేతికి ఉంగరంతో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది. ఆ ఫోటోలు చూసిన వారికి నిశ్చితార్ధం జరిగిందేమో అన్న అనుమానం రాక మానదు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరొక ఫోటోలో ఒక వ్యక్తి చేయి గట్టిగా పట్టుకుని ఉంది సోనాక్షి. కానీ ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించడం లేదు. అంతేకాకుండా ఆ ఫోటోలకు క్యాప్షన్ గా ‘నా జీవితంలో బిగ్ డే. నా కలలు నిజమవుతున్నాయి. ఈ సంతోషం మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను’ అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి ఆమెకు సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. ఆమె పెట్టిన పోస్టుకు సోనాక్షి సిన్హా, రియా కపూర్ వంటి సెలెబ్రిటీలు స్పందించారు. కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్‌లు పెట్టారు.
నిజమేనా కాదా?
సోనాక్షి సిన్హాకు పెళ్లవ్వబోతోంది అని తెలిస్తే ఆమె అభిమానులు హర్ట్ అవ్వడం ఖాయం. కానీ ఆ ఫోటోలు ఏదైనా సినిమా ప్రాంక్ లేదా ప్రమోషన్ అని అనుమానిస్తున్న వారు ఉన్నారు. కొన్ని రోజులు ఆగితే విషయం తేలిపోతుందని భావిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలింది. కాగా కొంతకాలంగా జహీర్ ఇక్బాల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని పుకార్లు వస్తున్నాయి. దీనిపై సోనాక్షి స్పందించలేదు. కానీ జహీర్ స్పందించాడు. ‘మీరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఆమెతో నేను ఉంటే మీకు సంతోషంగా అనిపిస్తే అలాగే ఆలోచించండి, లేకుంటే మానేయండి. నేను ఇలాంటి విషయాలు పట్టించుకోను’ అంటూ నెటిజన్లను ఉద్దేశించి అన్నాడు.
Srinidhi Shetty: 'కేజీఎఫ్' బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం
Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్లో జ్వాలతో క్లోజ్గా ఉంటున్న నిరుపమ్- రగిలిపోతున్న హిమ
Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్గా రిజెక్ట్ చేసిన వసుధార
Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Mahanadu 2022 Ongole: అమ్మ ఒడి అని, నాన్న బుడ్డి పెట్టారు! డబ్బు ఎటు పోతోంది? చరిత్ర హీనులు: చంద్రబాబు
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు