అన్వేషించండి

Ayalaan Teaser Review: హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్న శివకార్తికేయన్ - ‘అయలాన్’ టీజర్ చూశారా?

శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. దీని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.

ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ చేస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’. కోలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతికి ‘అయలాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. 

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక సంఖ్యలో సీజీ షాట్స్ 'అయలాన్' కోసం ఉపయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా అవుట్ ఫుట్ ఉండనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ నటించిన 'కోయి మిల్ గయా' తరహాలోనే ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ‘అయలాన్’ సినిమాలో శివ కార్తికేయన్ డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నారు. శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అయలాన్’ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి జయ రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ కార్తికేయన్. 'SK21' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా  నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'అయలాన్' ఫస్ట్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఈ పోస్టర్‌ను పరిశీలిస్తే ఏలియన్‌తో పాటు శివకార్తికేయన్ నీటిలో ఈదడం చూడవచ్చు. సౌత్ ఇండియాలోనే ఈ తరహా స్కేల్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు కూడా సౌత్ ఇండియాలో కూడా కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చినప్పటికీ ఏలియన్ ప్రధాన పాత్రలో రావడం మాత్రం దక్షిణాది భాషల్లో రాలేదు. ఏలియ‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌క్షిణాది చిత్రసీమ‌లో తెర‌కెక్కుతోన్న తొలి సినిమాగా ఈ మూవీ నిలవనుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget