Ghattamaneni Sitara : సితారపై సినిమాల ప్రభావం బాగానే ఉంది.. పెద్దయ్యాక మహేశ్ బాబులాగా యాక్టర్ అవుతానంటోంది
Sitara wants to be a Heroine : సితార ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. ఫ్యూచర్లో యాక్టర్‌ని అవుతానంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
Sitara Ghattamaneni Interview : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టీ సితార తాజాగా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి చిట్ చాట్ చేసింది. Mahesh Babu Foundation.. Telugu DMFతో చేతులు కలిపిన సందర్భంగా సితార ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఫౌండేషన్ రాష్ట్రంలోని డిజిటల్ క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి హెల్త్ కార్డులు అందించి వారితో చిట్ చాట్ (Sitara Chit Chat With Influencers) చేసింది. ఈ ఇంటర్వ్యూలో సితార చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది.
ఆమె ఫాలోయింగ్ రేంజ్ వేరు
సితార సినిమాల్లోకి రాకపోయినా.. దాదాపు హీరోయిన్ రేంజ్లో ఫాలోయింగ్‌ని కలిగి ఉంది. ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆమెను సితార పాప అంటూ ముద్దుగా పిలుస్తారు. సోషల్ మీడియాలో కూడా సితారకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, వెకేషన్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో సితార తాను ఏమి చదువుతుందో.. ఫ్యూచర్లో ఏమి అవుతుందో వంటి విషయాలు చెప్పింది.
నాన్నలా యాక్టర్‌ని అవుతా..
తనకు ఫ్యూచర్లో తండ్రిలా యాక్టింగ్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది సితార. కొన్ని సంవత్సరాల్లో తమ అభిమాన హీరోయిన్ కూతురిని హీరోయిన్గా చూస్తామని మహేశ్ బాబు ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఇప్పుడు ఏజ్ చాలా చిన్నది కదా.. మధ్యలో ఇంకేమైనా ప్రోఫెషన్స్ గురించి ఆలోచించినా.. యాక్టర్‌గా కచ్చితంగా చేస్తానని చెప్పింది సితార. ప్రస్తుతం 6వ తరగతి నుంచి 7వ క్లాస్‌లోకి వెళ్తున్నట్లు సితార ఇంటర్వ్యూలో చెప్పింది.
చిన్న వయసులోనే గుర్తింపు..
ఇప్పటికే సితార తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. PMJ Jewelsకి బ్రాండ్ అంబాసీడర్‌గా చేసింది. ఈ యాడ్‌తో సితారకు అతి చిన్న వయసులో ఈ యాడ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ యాడ్ వెనుక ఆమె తల్లి నమ్రతా ప్రభావమే ఎక్కువ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కూతురుని చిన్నప్పటి నుంచే ప్రమోట్ చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే మహేశ్ కుటుంబం నుంచి మంజుల హీరోయిన్గా వచ్చి.. కొన్ని కారణాల వల్ల ఆమె నటిగా రాణించలేకపోయింది. కానీ.. సితారకు ఇప్పుడు హీరోయిన్ అయ్యేందుకు ఎలాంటి అడ్డు లేదనే తెలుస్తోంది.
మమ్మీ ఫ్యాషన్ సెన్స్ కావాలి..
తన మమ్మీ ఫ్యాషన్ సెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. మా మమ్మీ నుంచి ఇదే నాకు కావాలని కోరుకుంటున్నట్లు సితార తెలిపింది. అలాగే ఇష్టమైన ఫుడ్ మ్యాగీ అని చెప్పింది. గౌతమ్‌తో తన రిలేషన్ గురించి అడుగగా.. తన అన్నది తనకంటే చిన్నదైన మనస్తత్వం అని చెప్పింది. గౌతమ్ ఇరిటేట్ చేసినా.. తనంటే ఎంతో ఇష్టమని చెప్పింది సితార.
సేవ చేస్తూనే ఉంటుంది..
సితార తన పేరెంట్స్లాగనే సేవలు కొనసాగిస్తానని చెప్పింది. PMJ Jewelsకి బ్రాండ్ అంబాసీడర్‌గా చేసిన ఈ భామ.. దానికి వచ్చిన డబ్బు అంతటి సేవ కార్యక్రమాల కోసం వినియోగించింది. తాజాగా పిల్లలకు సైకిళ్లు కూడా అందించింది. ఇలా చిన్న వయసునుంచే సితార మహేశ్ బాబు ఫౌండేషన్ తరఫున సేవలు చేస్తుంది.
Also Read : హాట్ రెడ్ శారీలో యాంకర్ మంజూష.. మేడమ్ ఏ చీర కట్టుకున్నా ఆ శారీకే అందమొస్తుందట