అన్వేషించండి
Advertisement
Sitara Ghattamaneni: 'నాన్న ప్రశాంతతను చెడగొట్టడంలో బిజీ' మహేష్ తో సితార అల్లరి
మహేష్ బాబు కూతురు సితార షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిన్నప్పుడే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన క్యూట్ ఫొటోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి పలు వీడియోలను రూపొందిస్తూ యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.
ఈరోజు ఆదివారం సెలవు కావడంతో తన తండ్రితో కలిసి అల్లరి చేస్తోన్న రెండు ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది సితార. ఈ ఫొటోల్లో తన తండ్రి మహేష్ బాబుని ముందుకుతోస్తూ అల్లరి చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలకు.. 'నాన్న ప్రశాంతతను చెడగొట్టే మిషన్ లో బిజీగా ఉన్నాను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సితార షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ను ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల 'అన్ స్టాపబుల్' షోకి వచ్చిన మహేష్ తన కూతురు సితార ఇంట్లో చాలా అల్లరి చేస్తుంటుందని చెప్పారు. ఎవరి మాటా వినదని.. తనకు నచ్చింది చేస్తుంటుందని నవ్వుతూ చెప్పారు మహేష్.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement