Bongu Bongu Song: ఇదేం పాటండి బాబు, ‘బొంగు చికెన్’ను ఇలా కూడా వాడేస్తారా? ఛీ, అంతా బూతే!
ఐటెమ్ సాంగ్స్‌లో డబుల్ మీనింగ్స్ సాధారణమే. కానీ, తెలుగులో బూతుగా మాట్లాడుకొనే ఒక పదాన్ని ‘బొంగు చికెన్’ వంకతో ఐటెమ్ సాంగ్‌లో వాడేశారు. ఈ పాట పాడింది ఎవరో తెలుసా?
![Bongu Bongu Song: ఇదేం పాటండి బాబు, ‘బొంగు చికెన్’ను ఇలా కూడా వాడేస్తారా? ఛీ, అంతా బూతే! Singer Geetha Madhuri's Bongu Bongu Song From Nuvve Naa Pranam Released Bongu Bongu Song: ఇదేం పాటండి బాబు, ‘బొంగు చికెన్’ను ఇలా కూడా వాడేస్తారా? ఛీ, అంతా బూతే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/11225c8deef5b4d07741997ebc841a67_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అరకు వెళ్లేవారిని ప్రకృతి అందాలే కాదు.. ఓ అరుదైన వంటకం కూడా ఆకట్టుకుంటుంది. అదే ‘బొంగు చికెన్’. వెదురు బొంగుల్లో చికెన్ వేసి.. మంటపై ఉడికిస్తారు. అప్పుడు వెదురు బొంగులో ఉండే ద్రవం.. చికెన్‌లో కలుస్తుంది. దీంతో అది చాలా రుచిగా మారుతుంది. ఒక్కసారి బొంగు చికెన్ తింటే.. మళ్లీ వదిలిపెట్టరు. అయితే, అంత మంచి వంటకాన్ని.. ఓ పాట మంటగలిపేసింది. సాధారణంగా ఐటెమ్ సాంగ్స్‌లో డబుల్ మినింగ్స్ సాధారణమే. కానీ, ఈ పాట వింటే తప్పకుండా మైండ్ బ్లాక్ అవుతుంది. ‘బొంగు చికెన్’ను ఇలా కూడా వాడేస్తారా అనిపిస్తుంది.
‘నువ్వే నా ప్రాణం’ అనే సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం ‘బొంగు చికెన్’ను వాడేశారు. అయితే, ఈ పాటలో డబుల్ మీనింగ్ కోసమే దాన్ని వాడుకున్నారనేది అర్థమవుతుంది. ఈ పాటను పూర్తిగా వినడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పాటను వెంకట్ బలగోని రచించగా, గాయని గీతా మాధురీ ఆలాపించింది. కన్నడ సీరియల్ నటుడు కిరణ్ రాజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో కిరణ్‌కు ఇదే తొలి చిత్రం. ప్రియా హెగ్డే హీరోయిన్. సుమన్, భాను చందర్, గిరిధర్, సొనియా తదితరులు నటిస్తున్నారు. మలిశెట్టి శేషుదేవరావు నిర్మాత. ఈ చిత్రానికి మని జెన్నా సంగీతం సమకూర్చాడు. ‘బొంగులో చికెన్’ పాటను ఇక్కడ చూడండి.
Also Read: బాలకృష్ణ మొదటి చిత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?
Also Read: ఆది ప్రేమలో వర్షిణీ? నువ్వే నాకు తగినవాడివంటూ ఇన్‌స్టా పోస్ట్!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)