Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి
సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గీతా మాధురి. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న గీతా మాధురి.. ‘ABP దేశం’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్..
నేను పక్కా లోకాలూ..
నేను వాడే గాజుల్.. కొక రాయికల్..
అన్నిఊర మాస్ లెక్కలూ...’’
ఈ పాట వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది.. గీతా మాధురీనే. ఆ స్వరం, ఆమె పాడిన తీరు.. మ్యూజిక్ లవర్స్‌ను మంత్రముగ్దులను చేస్తుంది. అందుకే, ఆమెకు అంతమంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు, ‘బిగ్ బాస్’ షోతో కూడా ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆమె భర్త నందుకు ఉన్న యూత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే నందు ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ మూవీలో చక్కని అభినయంతో మరోసారి సినీ ప్రేమికులను ఫిదా చేశారు. ప్రస్తుతం గీతా మాధురి అమెరికా టూర్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మా ‘ABP దేశం’ ప్రత్యేక ప్రతినిధితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ ఫలితంపై మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమా హిట్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. సినిమా కోసం వాళ్లు పడిన కష్టం, వచ్చిన అవుట్ ఫుట్ నేను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది.
నందు రష్మిపై వచ్చిన మీమ్స్ చూస్తే ఏమనిపించింది?
నాకు చాలా నవ్వు వచ్చింది. ఫన్నీగా చాలా సరదగా అనిపించింది. మా ముగ్గురి మధ్య చాలా మంచి సంబంధం ఉంది. టీవీ పరంగా నాది, రష్మిది మంచి రిలేషన్. ఇప్పుడు సినిమా పరంగా నందు, రష్మి కలిశారు. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఆ సినిమా హిట్ కోసం కష్టపడ్డారో నాకు తెలుసు. వారిద్దరిపై వచ్చిన ఆ మీమ్స్‌ను చూసి.. నేను చాలా ఎంజాయ్ చేశాను.
బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ కోసం నందు మేకోవర్ ఎలా అనిపించింది?
యాక్టర్స్ కష్టాన్ని చూస్తుంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా తర్వాత మరో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. దానికోసం చాలా సన్నబడ్డాడు. వీళ్ల హార్డ్ వర్క్, డెడికేషన్, ఫ్యాషన్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నందుని చూసి చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది.
నందుతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
మా పరిచయానికి వేదిక ప్రసాద్ ల్యాబ్స్. తను డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు, నేను సింగింగ్ కోసం వెళ్లాను. అప్పుడే మాట్లాడుకోవడానికి టైం కుదిరింది. ఆ తర్వాత పరిచయం పెరిగింది.
ఫస్ట్ లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు?
నేనే నందుకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశాను. ఆయనతో జీవితం బాగుంటుందేమో కదా? అని అనిపించి లవ్ ప్రపోజ్ చేశాను.
మీ పాప మీలా సింగర్ అవుతుందా? నందులా యాక్టర్ అవుతుందా?
అన్నీ అయిపోవాలి. అన్ని అయిపోతేనే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు.
బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది?
నాకు బిగ్ బాస్ చూసే టైం ఎక్కడుందండీ? నేను అయితే చూడటం లేదు. వాళ్ల వాళ్ల సోషల్ మీడియా పేజెస్ లో వాళ్లు పెట్టే పోస్టులు చూస్తున్నాను తప్ప, షో చూడటం లేదు. చూసేందుకు టైం కుదరడం లేదు. షోలో నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. నా అంచనా ప్రకారం రేవంత్ లేదంటే శ్రీహాన్ టైటిల్ గెలిచే అవకాశం ఉంది.
ప్రైవేట్ ఆల్బమ్స్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఇలా ఇలా పాట చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కొత్తగా చేయాలనే థాట్స్ వస్తున్నాయి. ఇంకా మున్ముందు చాలా చేయాలి అనుకుంటున్నాను.
Read Also: చైతూతో శోభితా డేటింగ్ రూమర్స్ నిజమేనా? ఆ వైరల్ ఫొటో చూస్తే మీకు అదే అనిపిస్తుంది!