అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్
సింగర్ చిన్మయి శ్రీపాద, కమల్ హాసన్ పై కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు. వారి కళ్ల ముందే ఓ గాయనికి 5 ఏళ్ల నిషేధం విధించినా మాట్లాడలేదని, రెజ్లర్ల విషయంలో మాత్రం మాట్లాడే మాటలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
Chinmai Sripada: సింగర్-వాయిస్-ఓవర్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద... తమిళ సూపర్ స్టార్, యూనివర్సల్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై.. రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసి.. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి సపోర్ట్ గా కమల్ హాసన్ ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా దానికి కౌంటర్ గా ఆమె రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెజ్లర్ల దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. తమ సమస్యను ఇంటర్నేషనల్ ఒలింపియన్స్ దృష్టికి తీసుకెళ్లి వారి సపోర్ట్ కోరాలని రెజ్లర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్లోరీ కోసం పోటీపడాల్సిన వారిని వ్యక్తిగత భద్రత కోసం పోరాడే స్థితికి నెట్టివేశాం. తోటి భారతీయులారా మన అటెన్షన్‌కు అర్హులు ఎవరు? మన జాతీయ క్రీడా చిహ్నాలా లేదా విస్తృతమైన నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులా? అని ప్రశ్నిస్తూ నాయకన్ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఎలా నమ్మాలి.?
కమల్ హాసన్ పోస్ట్ పై స్పందించిన చిన్మయి.. మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ప్రశ్నించినందుకు గతంలో ఆమెను తమిళ ఇండస్ట్రీ 5సంవత్సరాలు నిషేధం విధించింది. ఇది వారి కళ్ల ముందే జరిగినా.. ఆ కవి పట్ల వారికి గౌరవం ఉంది కాబట్టి దాని గురించి ఇంత వరకు ఎవరూ మాట్లాడలేదు. ఇలా తమ చుట్టే జరిగిన వేధింపులను పట్టించుకోకుండా ఇప్పుడు మహిళల భద్రత కోసం మాట్లాడే రాజకీయ నాయకులను ఎలా నమ్మాలి? జస్ట్ ఆస్కింగ్’ అంటూ చిన్మయి ట్వీట్ లో రాసుకొచ్చింది. దాంతో పాటు ఈ ట్వీట్ కారణంగా ఇప్పుడు నా టైమ్‌లైన్‌పై ఎన్ని అసభ్య కామెంట్స్ ని చూడాలో అంటూ ముందే ఆమె పేర్కొంది. ఇక వివాదంలో పలువురు నెటిజన్లు చిన్మయికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కమల్ హాసన్ కి మద్దతు ఇస్తున్నారు.
చిన్మయి ట్వీట్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. దీనికి 8 లక్షలకు పైగానే వ్యూస్, 4వేలకు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. “ఇప్పటి వరకు ఇతర నటులను లేదా రాజకీయ నాయకులను (అధికారం ఉన్నవారు) ఈ ప్రశ్న అడగడం నేను ఎక్కడ చూడలేదు? మా నాయకుడు మహిళల భద్రత కోసం గొంతు చించుకుంటే ఇప్పుడు మీరు మేల్కొని ఆయనను ప్రశ్నించడం బాధాకరం. కమల్ సార్ లాంటి దమ్ము ఏ నాయకుడికైనా ఉందా.. ఈ సమస్య కోసం మీరు ఎంత మంది గొంతెత్తడం చూశారు? అని ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు “ఇది ఏమి అర్ధంలేనిది? అటెన్షన్ సీకింగ్ అనేది మీకు వ్యసనంగా మారింది.." అంటూ మరొక యూజర్ రిప్లై ఇచ్చారు.
చిన్మయి ప్రముఖ నేపథ్య గాయని, వాయిస్ ఓవర్ యాక్టర్, రేడియో జాకీ, వ్యాపారవేత్త. 2002లో ‘కన్నతిల్ ముత్తమిట్టల్’లోని హిట్ పాటకు ఆమెకు అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత‘ఒరు దైవం థాంత పూవే’ ద్వారా ఆమె పేరు, ప్రఖ్యాతలు పొందారు. ప్రధానంగా దక్షిణ భారత పరిశ్రమలో చురుకుగా ఉన్నప్పటికీ, ఆమె 'తేరే బినా', 'మయ్యా' (2007 చిత్రం 'గురు'లో), 'తిత్లీ' 'జెహ్నాసీబ్' లోని పాటలు ఆమెకు మంంచి పేరు తీసుకువచ్చాయి. 2018లో, కవి-గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన చిన్మయి.. తర్వాత, ఆమె తమిళ ఫిల్మ్ డబ్బింగ్ యూనియన్ నుండి తొలగించబడింది. #MeToo ఆరోపణలతో చాలా సింగింగ్ ఆఫర్లు కూడా నిలిచిపోయాయని ఆమె ఇంతకుమునుపే వెల్లడించింది.
Read Also : ‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్