అన్వేషించండి

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

'బిచ్చగాడు' నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ క్యాన్సర్ ఉద్యోగులకు శుభవార్త అందించారు. వారికి ఉచితంగా చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సంప్రదించాల్సిన జీ మెయిల్ ఐడీని కూడా తెలియజేశారు..

Vijay Antony : 'బిచ్చగాడు 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో విజయ్ ఆంటోనీ.. క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరికైనా క్యాన్సర్ పేషంట్లకు చికిత్స నిమిత్తం ఏమైనా అవసరం ఉంటే తనను సంప్రదించవచ్చన్నారు. ఎవరైనా డబ్బుకు ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది పడితే వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తాననని హామీ ఇచ్చారు. అంతే కాదు దాంతో పాటు సంప్రదించాల్సిన ఇ-మెయిల్ ఐడీని కూడా తెలియజేశారు.

తాజా ప్రకటనతో విజయ్‌ మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. విజయ్ చేసిన పనిని ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. ఆయన ప్రకటించిన నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ విజయ్ గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇటీవలే రాజమహేంద్రవరం నగరంలోని జీఎస్‌ఎల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన మామోగ్రఫీ యూనిట్‌ను విజయ్‌ ఆంటోని ప్రారంభించారు. ‘బిచ్చగాడు 2’ ప్రమోషన్ కోసం సిటీకి వచ్చిన ఆయన.. నగర శివార్లలోని GSL మెడికల్ కాలేజీలో 'మెడికల్ సిమ్యులేషన్ యూనిట్' కార్యకలాపాలను గమనిస్తూ కొంత సమయం గడిపారు. మెడికల్ సిమ్యులేషన్ అనేది శరీర భాగాల 'వర్చువల్ రెస్పాన్స్' సహాయంతో వైద్య నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే ఒక పద్ధతి. 

ఈ మెథడాలజీపై చాలా ఆసక్తిని వ్యక్తం చేసిన విజయ్ ఆంటోనీ.. మెడికల్ సిమ్యులేషన్‌కి సంబంధించిన సినిమాపై పనిచేస్తున్నట్లు చెప్పారు. సబ్జెక్టుపై మంచి అవగాహన కోసం జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని అధ్యయనం చేసేందుకు అనుమతి కోరారు. ఆ తర్వాత ఆంటోని రోగులతో సంభాషించారు. అనంతరం ఆసుపత్రిలో చేరిన పిల్లలకు బహుమతులు అందజేశారు.

ఇదిలా ఉండగా 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2' సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ఆంటోనీ ఎనలేని పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక తాజాగా రిలీజైన 'బిచ్చగాడు-2' కేవలం మౌత్ టాక్ తోనే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే 'బిచ్చగాడు 3'పై విజయ్ ఆంటోనీ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. బిచ్చగాడు-2’కు కొనసాగింపుగా మూడో భాగం కూడా వస్తుందని, అది పూర్తిగా విభిన్నమైన కథతో తెరకెక్కుతుందని చెప్పారు.  స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడానికి ఏడాదికిపైనే సమయం పట్టవచ్చన్న ఆయన.. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను మొదలు పెడతానని విజయ్ చెప్పారు.‘బిచ్చగాడు3’కి కూడా తానే దర్శకత్వం వహిస్తానని స్పష్టం చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

Read Also: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

అంతకుముందు బిచ్చగాడు మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న విజయ్ ఆంటోనీ.. తమ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి తానే మాటలు, పాటలు రాశానని, మామూలుగా సినిమాల రిలీజ్ కు ముందు ఫంక్షన్స్ లో ఆ చిత్రాల గురించి ఓ రేంజ్ లో చెబుతాం. కానీ రిలీజ్ తర్వాత రెండు రోజుల పాటు బయటకు రాలేమన్నారు. కానీ బిచ్చగాడు2 సినిమా మమ్మల్ని కాలర్ ఎత్తుకు తిరిగేలా చేసిందని, అందుకు కారణం ప్రేక్షకులేనని ఆయన అన్నారు.

Read Also : అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget