Shruthi Haasan: ప్రభాస్ 'సలార్'లో హీరోయిన్ క్యారెక్టర్‌కు పవన్‌కల్యాణ్ కుమార్తె పేరు
శ్రుతీ హాసన్ పుట్టినరోజు సందర్భంగా 'సలార్' సినిమాలో ఆమె క్యారెక్టర్ లుక్, పేరును ఈ రోజు విడుదల చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్ జంటగా నటిస్తున్న తొలి సినిమా 'సలార్'. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు శ్రుతీ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె లుక్ విడుదల చేశారు. అలాగే క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు.
View this post on Instagram
'సలార్'లో ఆద్య పాత్రలో శ్రుతీ హాసన్ నటిస్తున్నట్టు చిత్రబృందం తెలియజేసింది. అన్నట్టు... పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ కుమార్తె పేరు ఆద్య అనే సంగతి తెలిసిందే. సినిమాలో శ్రుతీ హాసన్ క్యారెక్టర్ పేరు కూడా అదే కావడం యాదృశ్చికం కావచ్చు. ఆమెది జర్నలిస్ట్ పాత్ర అని సమాచారం. 'సలార్'లో ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమాలో కూడా శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. త్వరలో స్టార్ట్ చేయనున్నారు. 'బలుపు', 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమెకు మూడో చిత్రమిది.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















