News
News
వీడియోలు ఆటలు
X

2012 చాలా బాధపెట్టింది - శృతి హాసన్‌ భావోద్వేగం

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుర్రకారుకు మతిపోగొడుతుంది శృతి హాసన్. అయితే 2012లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. తాను ఎదుర్కొన్న కష్టసుఖాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హాసన్.

FOLLOW US: 
Share:

సినీ రంగంలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. ఇందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను హీరోయిన్లు గా తీసుకువచ్చారు. కుమారులను హీరోలుగా మార్చడానికి ఇష్టపడినంతగా, కుమార్తెలను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఇష్టపడరు కొంతమంది. అయితే స్టార్ నటుడి కుమార్తెగా పరిచయమై తన సత్తా చాటుతుంది హాట్ బ్యూటీ శృతి హాసన్. స్టార్ కిడ్ గా వచ్చినప్పటికీ తన టాలెంట్ తోనే ఎన్నో సినిమాల్లో అవకాశాలు పొందింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. దీంతో వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. 

గతంలో ఎదురైన కష్టసుఖాలను గుర్తు చేసుకొంది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది శృతి హాసన్. 2012లో ఒక సినిమా గురించి, ఆ సమయంలో ఆమె పడిన మనోవేదన గురించి రాసుకొచ్చింది శృతి. ఈ సందర్భంగా అప్పటి ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటో 2012లోది. ఆ ఏడాది వ్యక్తిగతంగా గొప్ప సంవత్సరం కాదని.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరుగుతాయని వాటిని ఎదుర్కోవాలని అప్పుడు తెలియదని పేర్కొంది. ఇప్పుడు నేను అప్పటి శృతి హాసన్‌ను కలిసి హగ్ ఇచ్చి ధైర్యం చెప్పాలని అనుకుంటున్నానని తెలిపింది. కొంత మంది నుంచి విమర్శలు ఎదుర్కోవడం కామన్ అంటూ.. ఎలా ఉన్నా నెగటివ్ గా మాట్లాడే వారు మాట్లాడుతుంటారని ఆమెకు చెబుతానంది. ఇలాంటి వారి గురించి నాకు ఇబ్బంది లేదు. నిన్నటి గురించి ఆలోచిస్తూనే రేపటి గమ్యం ఏంటి అని అప్పట్లో తరచూ బాధ పడుతూ ఉండేదాన్ని అంటూ రాసుకొచ్చింది. కనే కలల కోసం కూడా ఏదో నేర్చుకోవాలని నాలో నేనే పోరాటం చేసేదాన్ని అని తెలిపింది. ఈ నిశ్శబ్ద పోరాటం చాలా హింసాత్మకం, ఇది నిజమని పేర్కొంది.

తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో నిత్యం షేర్ చేస్తూ.. కుర్రకారుకు మతి పోగొడుతుంది శృతి హాసన్. శృతి తనపై వచ్చే రూమర్లకు కూడా ఇదే వేదికగా పుల్ స్టాప్ పెట్టేస్తూ.. కౌంటర్లు ఇచ్చేస్తోంది. గతంలో ఈమె ప్రేమలో ఉందనే పుకార్లు ఎక్కువగా వచ్చాయి. శంతను హజారికాతో కూడా రిలేషన్ లో ఉందన్న విషయం వైరల్ అయింది. హాసన్ ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా రూమర్లు వైరల్ అయ్యాయి. దీనిపై ఇన్ స్టా స్టోరీలో అదిరిపోయే కౌంటర్ వేసి రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. 

View this post on Instagram
 
A post shared by Shruti Haasan (@shrutzhaasan)

అమ్మలక్కలు ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టుగా ఇలా రూమర్లు క్రియేట్ చేస్తున్నారన్నట్టుగా రాసుకొచ్చింది. కూల్ ఆంటీస్.. పెళ్లి ఇప్పుడే కాదు.. అసలు పెళ్లి గురించి ఇప్పుడే అనుకోలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. వైరల్ అవుతూ నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. దీంతో ఈ భామ మంచి పేరునే సంపాదించింది. అంతే కాదు పారితోషికం కూడా బాగానే అందుకున్నట్టు వినికిడి. ఇక తన తర్వాతి ప్రాజెక్ట్ గా సలార్ మూవీలో ప్రభాస్ సరసన నటించనుంది శృతి హాసన్. ఈ సినిమా హిట్ కొడితే ఈ అమ్మడుకు హ్యాట్రిక్ కొట్టినట్లే.

Also Read: 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్! 

Published at : 09 Feb 2023 12:28 PM (IST) Tags: Shruti Haasan Shruti Haasan Movies Instagram Post Shruti Haasan in 2012

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా