News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Raj Kundra: అశ్లీల చిత్రాల కేసు ఎఫెక్ట్... సోషల్ మీడియాలో రాజ్ అకౌంట్స్ డిలీట్!

వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సోషల్ మీడియాకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్‌ను శాశ్వ‌తంగా డిలీట్ చేశారు.

FOLLOW US: 
Share:

సోషల్ మీడియాకు శాశ్వతంగా దూరంగా ఉండాలని వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నిర్ణయించుకున్నారు. దీనికి అశ్లీల చిత్రాల కేసు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో పోర్నోగ్రఫీ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత గానీ ఆయనకు బెయిల్ రాలేదు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అజ్ఞాతవాసం గడుపుతున్నారు. పబ్లిక్‌లోకి పెద్దగా రావడం లేదు. ఇప్పుడు పబ్లిక్ ఫ్లాట్‌ఫార్మ్స్‌కి కూడా పూర్తిగా దూరమయ్యారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్స్‌ను శాశ్వ‌తంగా డిలీట్ చేశారు రాజ్ కుంద్రా.

రాజ్ కుంద్రాపై అశ్లీల చిత్రాల కేసు నమోదు అయిన తర్వాత ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనకు మద్దతుగా గేహనా వశిష్ఠ మాట్లాడగా... షెర్లిన్ చోప్రా వంటి వారు రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య, ప్రముఖ హిందీ కథానాయిక శిల్పా శెట్టిపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఒకరిపై మరొకరు పరువు నష్టం దావా కేసులతో కోర్టు మెట్లు ఎక్కారు. అది పక్కన పెడితే... రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై ప్రేక్షకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. శిల్పా శెట్టి కొన్ని రోజులు షూటింగులకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నుండి హాజరు అవుతున్నారనుకోండి.

ఇప్పుడు రాజ్ కుంద్రా సోషల్ మీడియాకు దూరం కావడం బాలీవుడ్ ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ట్రోలింగ్, ఇతర విమర్శలకు దూరంగా ఉండటం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తొలుత అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి పేరు కూడా వినిపించింది. అయితే... ఆమె పాత్ర ఏమీ లేదని పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.

Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 

Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?

Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..

Also Read: రీషూట్ మోడ్ లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 07:13 PM (IST) Tags: Raj Kundra Shilpa Shetty Raj Kundra deletes Instagram Twitter accounts

ఇవి కూడా చూడండి

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్