News
News
X

Sherlyn Chopra Sajid Khan : 'బిగ్ బాస్'లో దర్శకుడిపై పోలీస్ కేసు - షో నుంచి తీసేయండి సార్

బాలీవుడ్ 'బిగ్ బాస్' మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న దర్శకుడిపై షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని షో నుంచి తప్పించాలని కోరారు. అసలు వివరాల్లోకి వెళితే...

FOLLOW US: 
Share:

'బిగ్ బాస్' (Bigg Boss) కు వివాదాలు కొత్త కాదు. అందులోనూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా చేసే హిందీ 'బిగ్ బాస్' ఇప్పటికి పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని, పదహారో సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షో మీద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పలు విమర్శలు వచ్చాయి. వివాదాలను చూసింది. అయితే, ఇప్పుడు దీనిపై 'మీ టూ' ఎఫెక్ట్ పడింది. ఇది తే తీరానికి చేరుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

సాజిద్ ఖాన్‌పై పోలీస్ కంప్లైంట్!
'బిగ్ బాస్ 16' (Bigg Boss 16) లో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) పార్టిసిపేట్ చేస్తున్నారు. ముంబైలోని జుహూ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నటి షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ కాపీని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, నేషనల్ ఉమెన్స్ కమిషన్‌కు కూడా పంపించారు. 'బిగ్ బాస్' షో నుంచి సాజిద్ ఖాన్‌ను తప్పించాలని కోరారు. సాజిద్ మీద ఎందుకు ఫిర్యాదు చేశారు? అనే వివరాల్లోకి వెళితే... 

సాజిద్... ఓ శృంగార వేటగాడు!
పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కొన్ని రోజుల ముందు సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా విమర్శలు చేశారు. అతడిని శృంగారం కోసం అన్వేషించే వేటగాడిగా పేర్కొన్నారు. తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న తనకు 2005లో సాజిద్ నుంచి ఫోన్ వచ్చిందని, స్టోరీ చెబుతానని ఇంటికి పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. అసలే దుఃఖంలో ఉన్న తనకు అప్పుడు ఆ ఘటనను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదన్నారు. 

2005లో జరిగిన ఘటనపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాయనున్నారని, రెండు మూడు రోజుల్లో 'బిగ్ బాస్' కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న కలర్స్ టీవీ యాజమాన్యానికి సాజిద్ ఖాన్ ఉన్న ఎపిసోడ్స్ ప్రసారం చేయకూడదని నోటీసులు జారీ చేయనున్నట్లు షెర్లిన్ న్యాయవాది పేర్కొన్నారు.

షెర్లిన్ కంటే ముందు తనుశ్రీ దత్తా, కనిష్కా సోని!
సాజిద్ ఖాన్‌పై గతంలో కూడా విమర్శలు వచ్చాయి. ఆయన 'బిగ్ బాస్'లో పాల్గొనడంపై ఇండియాలో 'మీ టూ' ఉద్యమం మొదలు పెట్టిన కథానాయికలలో ఒకరైన తనుశ్రీ దత్తా (Tanushree Dutta) అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగర్ సోనా మహాపాత్ర, నటుడు అలీ ఫజల్ తదితరులు అతడిని షో నుంచి ఎలిమినేట్ చేయాలని కోరారు. బాలీవుడ్ సీరియల్స్ 'దియా ఔర్ బాతి హమ్', 'దేవోమ్ కి దేవ్... మహాదేవ్', 'దో దిల్ ఏక్ జాన్', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్ చేసిన నటి కనిష్కా సోని (Kanishka Soni) సైతం తనతో సాజిద్ ఖాన్ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వీడియో విడుదల చేశారు. 'మీ టూ' ఉద్యమం సమయంలో పలువురు మహిళలు సాజిద్ ఖాన్ మీద విమర్శలు చేశారు. 

Also Read : బాలయ్య ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్, కొండారెడ్డి బురుజు సాక్షిగా అదిరిపోయే అప్‌డేట్!

View this post on Instagram
 
A post shared by Kanishka Soni (@itskanishkasoni)

Published at : 20 Oct 2022 06:27 AM (IST) Tags: Sherlyn Chopra Sajid Khan Bigg Boss 16 Bigg Boss 16 Controversy Sherlyn Complaints Sajid

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?