News
News
X

Sherlyn Chopra on Salman Khan: అతని వెనక సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అందుకే పొలీసులు పట్టించుకోవట్లేదు : నటి షెర్లిన్ చోప్రా

బిగ్ బాస్ నుంచి సాజిద్ ను తొలగించాలని నటి షెర్లిన్ చోప్రా ముంబై జుహు పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమె శనివారం జుహు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

FOLLOW US: 
 
బిగ్ బాస్ ఏ భాషలో ఈ షో చేసినా వివాదాలు మాత్రం కామన్. తాజాగా హిందీ బిగ్ బాస్ లో మరో కొత్త వివాదం మొదలయ్యింది. బిగ్ బాస్(హిందీ) 16 కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 లో 'మీ టూ' లో ఆరోపణలు ఎదుర్కొన్న ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ 16 లోకి తీసుకోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ 16 లో కంటెస్టెంట్ గా తీసుకోవడంతో మరింత వేడెక్కింది. బిగ్ బాస్ నుంచి సాజిద్ ను తొలగించాలని నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ షెర్లిన్ చోప్రా ముంబై జుహు పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమె శనివారం జుహు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. జుహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన షెర్లిన్ బయటకు వచ్చి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. పోలీసుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, సాజిద్ వెనక పెద్ద వ్యక్తులు ఉన్నారని పేర్కొంది. 

సల్మాన్ ఖాన్ సాజిద్ ను కాపాడుతున్నాడు :

పోలీస్ స్టేషన్ లో తనకు ఎవరు సహాయం చేయడం లేదని షెర్లిన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసిన ఫిర్యాదుకు సరైన స్పందన రాకపోవడంతో మళ్లీ పోలీస్ స్టేషన్ కు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే లోపలకి వెళ్ళాక కేస్ ఫైల్ చేయాలని అక్కడ ఉన్న మహిళా పోలీస్ అధికారిణిని అభ్యర్తించినా ఫలితం లేదని అన్నారు. తనకు అక్కడ ఎవరూ ఎలాంటి సాయం చేయడం లేదని వాపోయారు. సాజిద్ ఖాన్ కు బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ అండగా ఉన్నాడని అన్నారు. అందరికి భాయిజాన్ అని చెప్పుకునే ఆయన మాకెందుకు భాయిజాన్ కాలేకపోతున్నారు అంటూ విమర్శలు చేసింది షెర్లిన్.

జుహు పోలీస్ స్టేషన్ లో తనకు ఎలాంటి సహాయం అందలేదని, ఇదే విషయం అసిస్టెంస్ కమిషనర్ కు చెప్పానని అన్నారు షెర్లిన్. తన స్టేట్మెంట్ ను ఎందుకు తీసుకోవడంలేదో అర్థం కావట్లేదని వ్యాఖ్యనించారు. సెలబ్రెటీల విషయంలోనే ఇలా ఉంటే ఇక సాధారణ మహిళకు ఏమీ జరుగుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఈ కేసులో నిష్పాక్షికమైన తీర్పును మాత్రమే కోరుతున్నానని కన్నీరు పర్యంతమయ్యారు.

News Reels

Also Read : విడుదలకు ముందే 'దిల్' రాజుకు 30 కోట్లు లాభం?

సాజిద్ ఖాన్ పై బాలీవుడ్ లో విమర్శలు అనేకం ఉన్నాయి. 2018 లో సాజిద్ ఖాన్ 'మీ టూ' వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో అతనితో పాటు  వివిధ ప్రాజెక్టులలో పనిచేసిన మహిళలు కొంతమంది సాజిద్ పై ఆరోపణలు చేశారు. తమను లైంగికంగా వేధించారని ఆరోపించారు. సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి ఇలా పలువురు మహిళలు అతనిపై ఆరోపణలు చేశారు. వారిలో ఒకరు షెర్లిన్ చోప్రా. సాజిద్ ప్రస్తుతం సల్మాన్-ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ 16 లో పాల్గొంటున్నారు. ఆరోపణల నేపథ్యంలో 'హౌస్‌ఫుల్ 4" సినిమా నుంచి వైదొలిగిన తర్వాత ఇది ఆయన కనిపిస్తోన్న మొదటి షో కావడం తో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తురుగుతుందో చూడాలి.

Published at : 30 Oct 2022 07:11 PM (IST) Tags: salman khan Sherlyn Chopra Sajid Khan Big boss 16

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

Mahesh Babu: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - తిరిగి రంగంలోకి దిగిన మహేష్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

స్టార్లను సైతం వెనక్కి నెట్టిన రామ్‌చరణ్ - ట్రూ లెజెండ్ అవార్డు దక్కించుకున్న మెగాపవర్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు