Rashmika Mandanna: ఆడవాళ్లూ.. రాజమండ్రిలో వాళ్లిద్దరూ!
శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
యువ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా... ప్రస్తుతం వాళ్ళిద్దరూ రాజమండ్రిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? అంటే... షూటింగ్ చేస్తున్నారు. శర్వా, రష్మిక తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంతకు ముందు కొంత చిత్రీకరణ చేశారు. ఆదివారం రాజమండ్రిలో తాజా షెడ్యూల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్వానంద్‌తో సెల్ఫీ తీసుకున్నారు రష్మికా మందన్నా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పల్లెటూరి నేపథ్యంలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
సమాజంలో, కుటుంబంలో మహిళల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' తరువాత దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రమిది. సహజంగానే ఆయన చిత్రాల్లో భావోద్వేగాలు, సంభాషణలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంటాయని సమాచారం. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని ఆకట్టుకునే కథను కిషోర్ తిరుమల రెడీ చేశారట. కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొదలైంది. హిందీ సినిమా 'మిషన్ మజ్ను'తో రష్మిక బిజీగా ఉన్నా ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి కొంత షూటింగ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ డేట్స్ కేటాయించారట.
నిజం చెప్పాలంటే... విక్టరీ వెంకటేష్ చేయాల్సిన చిత్రమిది. అనివార్య కారణాల వల్ల ఆయనతో సినిమా పట్టాలు ఎక్కలేదు. అప్పటికే నిర్మాత సుధాకర్ చెరుకూరితో 'పడి పడి లేచె మనసు' చేశాడు శర్వానంద్. నిర్మాత ద్వారా కథ విన్న ఆయన, వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పారు. 'శతమానం భవతి', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'... లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ శర్వా ఖాతాలో ఉన్నాయి. మరోసారి ఆయన ఫ్యామిలీ సినిమా చేస్తున్నారు. దీనికి తోడు రష్మికా మందన్నా హీరోయిన్ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో రాధికా శరత్ కుమార్, ఖుష్భూ, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'వెన్నెల' కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అందరి పాత్రలు ఇంపార్టెన్స్ ఉంటుందట.
Also Read: హౌస్ మేట్స్ కి నాగార్జున షాక్.. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా..?
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?