IIFA Awards: ఐఫాను ఊపేసిన ‘ఊ అంటావా’ - స్టెప్పులేసిన షారుక్, జాన్వీ, విక్కీ కౌశల్!
Oo Antava: ఐఫా అవార్డుల వేడుకలను ‘ఊ అంటావా’ పాట ఊపేసింది. మొదట ఈ పాటకు స్టేజీ మీద షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ కలిసి చిందేయగా... ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ సోలోగా అలరించింది.
Shahrukh Khan Vicky Kaushal Janhvi Kapoor: ఐఫా అవార్డుల వేడుకల్లో ‘పుష్ఫ’లోని ‘ఊ అంటావా’ పాట ఒక ఊపు ఊపింది. బాలీవుడ్ బాద్‌షా, కింగ్ షారుక్ ఖాన్, విక్కీ కౌశల్ ఇద్దరూ కలిసి ఈ పాటకు స్టెప్పేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌కు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి దేశంలో ‘పుష్ఫ’ ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
King Saab @iamsrk and Vicky Kaushal BhAAi Dancing to our #Ooantava song setting The Stage On FIRE at #IIFAIUtsavam2024
— Viraj Anand (@FunnyKid018) September 28, 2024
You'll witness one of it's kind Havoc this Time again for sure😎
Promise📌🏌♂️#Pushpa2TheRule#IIFAUtsavam2024@alluarjun 😎pic.twitter.com/OgUrb0vVe3
ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) అవార్డ్స్ 24వ ఎడిషన్ అబుదాబిలో ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడం, హిందీ... ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చలనచిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ హాజరు కానున్న ఈ ఐఫా ఉత్సవం మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతోంది.
చిరంజీవికి ప్రత్యేక గౌరవం
అబుదాబిలో బాలీవుడ్, సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటీనటులందరినీ ఒకే చోటకి తీసుకు వస్తూ సాగిన ఐఫా ఉత్సవం మొదటి రోజు అత్యద్భుతంగా జరిగింది. ఇక ఈ వేడుకలో పలువురు నటీనటులు, టెక్నీషియన్లకు వారు నటించిన సినిమాలకు గానూ అవార్డులను అందజేశారు. అలాగే భారతీయ సినిమా చరిత్రలో లెజెండ్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవిని బెస్ట్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియన్ సినిమా అవార్డుతో ఘనంగా సత్కరించడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ, గీత రచయిత జావేద్ అక్తర్ మెగా స్టార్‌ను సన్మానించారు. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం, ఐశ్వర్యారాయ్ బచ్చన్, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో కన్పించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఐఫా ఉత్సవాల్లో విశ్వ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ కూడా పాల్గొన్నారు. సాధారణంగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తారు. తనను సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ దర్శకుడు మణిరత్నంను ఎంతో గౌరవిస్తారు. మణిరత్నం ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి తన గురు భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కనిపించగానే ఆయన కాళ్లు మొక్కారు. ఐశ్వర్యా రాయ్ సంస్కారానికి వేడుకలో పాల్గొన్న వాళ్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండటం... తన ఎదుగుదలకు కారణమైన వారిని అస్సలు మర్చిపోకూడదనడానికి ఐశ్వర్య నిలువెత్తు నిదర్శనం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు... IIFA వేడులో అందజేసిన బాలీవుడ్ ప్రముఖులు