By: ABP Desam | Updated at : 24 Dec 2022 10:55 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Yash Raj Films/twitter
సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన తాజా మూవీ ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా జనవరి 25, 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఓ అరుదైన గుర్తింపు దక్కించుకోబోతోంది. ‘పఠాన్’ ICE (ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్‌పీరియన్స్) ఫార్మాట్‌లో విడుదలైన తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించనుంది.
ICE థియేటర్ ఫార్మాట్ అంటే?
ICE థియేటర్ ఫార్మాట్ లో మెయిన్ స్ర్కీన్ తో పాటు సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. సాధారణంగా కనిపించే కలర్స్, కదలికలకు పూర్తి భిన్నంగా మెరుగైన ఇమ్మర్షన్ ను అందిస్తాయి. అంతర్జాతీయంగా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’, ‘ది బ్యాట్‌మ్యాన్’, ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్’, ‘టాప్ గన్: మావెరిక్ అండ్ మోర్బియస్’ లాంటి సినిమాలు ఈ హై-ఎండ్ ఫార్మాట్‌లో ICE థియేటర్ లలో విడుదలయ్యాయి.
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నాం- రోహన్ మల్హోత్రా
“ప్రేక్షకులకు అత్యంత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడానికి ఈ సరికొత్త పాత్ బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించడంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ముందు వరుసలో ఉంది. ICE ఫార్మాట్ లో విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ‘పఠాన్’ ఘనత సాధించనుంది. సినిమాలో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యే అనుభూతిని అందించగలదని భావిస్తున్నాయి. అందుకు మేము గర్విస్తున్నాము" అని యష్ రాజ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ మల్హోత్రా వెల్లడించారు.
“అవతార్: ది వే ఆఫ్ వాటర్” స్క్రీనింగ్ తో ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని రెండు ఆపరేషనల్ పివిఆర్ సినిమా సైట్ లతో ఈ ఫార్మాట్ మొదలయ్యింది. ఈ ఫార్మాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరుల కంటే ముందుగానే స్వీకరించడం మా YRF DNAలో ఒక భాగం. మేము గతంలో ‘ధూమ్ 3’ (2013) – IMAXలో విడుదల చేశాం. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ (2018) - 4DX, MX4Dలో రిలీజ్ చేశాం. ‘వార్’ (2019)ని డి-బాక్స్ లో విడుదల చేశాం. ప్రస్తుతం ICE ఫార్మాట్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీని అందరికంటే ముందుగా స్వీకరించే పద్ధతిని YRF కొనసాగిస్తుంది” అని రోహన్ తెలిపారు.
వివాదాస్పదమైన 'బేషరమ్ రంగ్' పాట
ఇక ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాట వివాదాస్పదం అయ్యింది. దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కనిపించడం పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. పాటలోని కంటెంట్ తో ఓ సమూహాన్ని కించపరిచిందని ఆరోపిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత ఈ పాటను రీ షూట్ చేశారు.
We’d be lying if we said we haven’t watched this part more than once! 😍 #JhoomeJoPathaan - https://t.co/s20oyl2jwW
— Yash Raj Films (@yrf) December 24, 2022
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/TfjNRrAEJO
Read Also: ‘సర్కస్’ డిజాస్టర్ - పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్, బుట్టబొమ్మకు కలిసి రాని 2022
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!
Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?