అన్వేషించండి

Shadow Web Series Update : 'షాడో' వెబ్ సిరీస్ - కొంత టైమ్ అవసరమే, మధుబాబుతో టచ్‌లో శరత్ మండవ

మధుబాబు 'షాడో' కథలను వెబ్ సిరీస్ రూపంలో వీక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు దర్శకుడు శరత్ మండవ అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే...

'షాడో' మధు బాబు (Shadow Madhubabu) అభిమానులకు ఒక గుడ్ న్యూస్! ఆయన కథలు ఓటీటీ వేదికలోకి రానున్నాయని ABP Desam సోమవారం వెల్లడించింది. 'షాడో' కథలను వెబ్ సిరీస్‌గా మలిచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని పాఠకులకు తెలియజేసింది. 'రామారావు ఆన్ డ్యూటీ' దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) అది నిజమేనని తెలిపారు.
 
గురువుగారితో ఎప్పట్నుంచో టచ్‌లో ఉన్నాను - శరత్ మండవ
మధు బాబు 'షాడో' నవల (కథలు) హక్కులను దర్శకుడు శరత్ మండవ సొంతం చేసుకున్నారు. షాడో నేపథ్యంలో వచ్చిన అన్ని కథలకు చెందిన ఐపీ రైట్స్ (టోటల్ రైట్స్) ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ ప్రయత్నాలు కూడా ఆయనే ప్రారంభించారు. దీని గురించి శరత్ మండవ మాట్లాడుతూ ''గురువు గారు (మధు బాబు) తో నేను చాలా రోజుల నుంచి టచ్‌లో ఉన్నాను. 'షాడో'ను విజువల్ రూపంలోకి వెబ్ సిరీస్‌గా వీక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఆయన నాకు అనుమతి ఇవ్వడం నాకు  లభించిన ప్రత్యేక హక్కుగా భావిస్తున్నాను. గౌరవంగా ఉంది'' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

'షాడో' వెబ్ సిరీస్‌కు కొంత టైమ్ పడుతుంది - శరత్ మండవ
Shadow Web Series - Sarath Mandava : 'షాడో' వెబ్ సిరీస్ మీద తాము వర్క్ చేస్తున్నామని... దానికి ఒక రూపం వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని శరత్ మండవ తెలిపారు. సిరీస్ తీయడానికి కొంత టైమ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. నదీ ప్రవాహం సాఫీగా సాగాలంటే అందుకు తగినంత నీరు అవసరమన్నారు.

పాన్ ఇండియా స్థాయిలో 'షాడో' వెబ్ సిరీస్!
'షాడో' వెబ్ సిరీస్‌ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా... దేశంలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించడానికి శరత్ మండవ ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. ఫస్ట్ సీజన్ స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజిలో ఉందని టాక్. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒక్కొక్కరు డైరెక్ట్ చేయనున్నారట. నటీనటుల ఎంపిక త్వరలో ప్రారంభం అవుతుందేమో!? 

Also Read : Chiranjeevi - Krishna Gardens : ప్రజారాజ్యం అప్పులకు చిరంజీవి అమ్మేసిన 'కృష్ణా గార్డెన్స్' చరిత్ర ఏమిటి? ఇప్పుడు దాని విలువ ఎంత?

తెలుగు నవలా ప్రపంచంలో మధు బాబు ఒక సంచలనం. ఆయన పూర్తి పేరు వల్లూరు మధుసూదన రావు కంటే 'షాడో' మధు బాబు (Shadow Madhu Babu) హా ఎక్కువ పేరు పొందారు. డిటెక్టివ్ నవలలతో ఆయన అంత ఫేమస్ అయ్యారు. ఓ తరం పాఠకులు ఆయన నవలలు చదువుతూ పెరిగారు. ఆయన రాసిన కథలు చదవడం తమ దినచర్యగా చేసుకున్న వారు కూడా ఉన్నారు. తెలుగు నాట 1970 - 1990 మధ్యలో ఆయన రాసిన కథ చదవని పాఠకులు లేదని చెబితే అతిశయోక్తి కాదు. 

'చక్రతీర్థం', 'కాళికాలయం' సీరియళ్లకూ మధు బాబు కథలు అందించారు. స్వాతి, నవ్య వంటి వార పత్రికలకు, నది అనే మాస పత్రికకు ఆయన కథలు రాశారు. 'షాడో' కథల విషయానికి వస్తే... 'భోళా శంకర్', 'అసైన్‌మెంట్‌ కరాచీ', 'డెవిల్స్ ఇన్ నికోబర్', 'టార్గెట్ షాడో' వంటివి అత్యంత పాఠకాదరణ పొందాయి. ఈ తరం పాఠకులు, ప్రేక్షకులు కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు వినే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మధు బాబు కథలను పరిచయం చేసే బాధ్యతను శరత్ మండవ తీసుకున్నారు. 

Also Read : RC15 Movie Leaked Pics : రామ్ చరణ్ భార్యగా అంజలి - శంకర్‌కు ట్విస్ట్ ఇచ్చిన లీక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
TG Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
Lavanya and Raj Tarun case: లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
Arvind Kejriwal: 'పుష్ప 2'లో సూసేకి పాటకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డ్యాన్స్... ఇదీ ఐకాన్ స్టార్ రేంజ్
'పుష్ప 2'లో సూసేకి పాటకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డ్యాన్స్... ఇదీ ఐకాన్ స్టార్ రేంజ్
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం - సురక్షితంగా బయటపడ్డ నటుడు
తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం - సురక్షితంగా బయటపడ్డ నటుడు
Embed widget