అన్వేషించండి

Shaakuntalam: ఎట్టకేలకు 'శాకుంతలం' విడుదల తేదీ ప్రకటన, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘శాకుంతలం’ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ సమంత నటించిన తాజా సినిమా ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే పూర్తయినా.. రిలీజ్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్ని రోజులు అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ ఏడాది నవంబర్ 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దిల్ రాజు తన సోషల్ మీడియా ఖాతాలో మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో సినిమా విడుదల  తేదీని ప్రకటించారు. ఇక మోషన్ పోస్టర్ లో సమంత, దేవ్ మోహన్ చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.

కొన్నాళ్లక్రితం ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కారణాలు ఏంటో తెలియదు కానీ విడుదల చేయలేదు. అటు సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తోన్న 'వారసుడు' సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి   'శాకుంతలం' సినిమాను విడుదలను నవంబర్ తొలి వారంలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ధనుష్ హీరోగా నటించిన 'సార్', నాని నిర్మిస్తున్న 'హిట్ 2' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కంటే ముందే 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఖరారు చేశారు. వాస్తవానికి  'శాకుంతలం' సినిమా భారీ గ్రాఫిక్స్ తో ముడిపడి ఉన్నది.  అందుకోసం చాలా సమయం, శ్రమ, అవసరం పడ్డాయట.  అందుకే సినిమా విడుదల ఆలస్యం అయినట్లు దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. ఆడియన్స్ కి మంచి సినిమా అందించాలనేది ఆలోచనతోనే జాగ్రత్తగా సినిమాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.   

ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

‘శకుంతలం’ అప్‌డేప్‌పై రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. రామ్ చరణ్, దర్శకుడు శంకర్ చిత్రం RC25 అప్‌డేట్స్ ఇంకా ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సినిమాల అప్‌డేట్లు ఇస్తున్నారు, రామ్ చరణ్ ఆర్సీ25 అప్‌డేట్ ఎందుకు ఇవ్వడంలేదంటూ ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై దిల్ రాజు టీమ్ ఏం చెబుతారో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
New MG Hector : లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Embed widget