అన్వేషించండి

Sasivadane Movie: వాత పెట్టిన ఎదపై ఐస్ రాసినట్టు, ఆకట్టుకుంటున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్!

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘డీజే పిల్లా’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎంతో వినసొంపుగా, మళ్లీ మళ్లీ వినేలా చేస్తోంది.

ప్రేక్షకులను అలరిస్తున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్

‘పలాస’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ అట్లూరు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోయిన్ నటిస్తున్నది. సాయి మోహన్ దర్శకత్వంలో విలేజ్ బ్యాగ్రాప్ లో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘డీజే పిల్లా’ అనే లిరికల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చక్కటి సంగీతం, వినసొంపైన లిరిక్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందరినీ అలరిస్తోంది. పల్లెటూరి పడుచులా కోమలి ప్రసాద్ అందాల కనువిందు చేస్తుంటే, అమ్మాయిని ఇష్టపడే అబ్బాయిగా రక్షిత్ కనిపించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న'డీజే పిల్లా'      

ఇక 'డీజే పిల్లా' పాటకు కిట్టు విస్సా ప్రగడ చక్కటి సాహిత్యం అందించారు.  "నా దిల్లే నీ వల్లే టూరింగు టాకీసులా మారెనే, నా కల్లో నీ బొమ్మనే షో మీద షో వేసి చూపించనే, డీజే పిల్లా ఎదలో ఇల్లా విజిలే వేసి బీటే కొట్టగా .." అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తోంది. వైషాగ్ ఈ సాంగ్ ను చక్కగా పాడారు. శరవణ వాసుదేవన్ అద్భుతమైన సంగీతంతో ఆకట్టుకున్నారు.  జేడీ మాస్టర్ హుక్ స్టెప్స్ తెగ  ఆకట్టుకుంటున్నాయి.  ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇన్ స్టాలో రీల్స్ లో ట్రెండ్ అవుతోంది. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ‘శశివదనే చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు.  

త్వరలో ‘శశివదనే’ రిలీజ్ డేట్ అనౌన్స్

ఇక లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా మాట్లాడిన చిత్ర నిర్మాతలు  అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. 'శశివదనే' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మూవీ హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్ తో రూపొందింది. మంచి లవ్ స్టోరీతో తెలుగులో సినిమా  వచ్చి చాలా రోజులువుతుందని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ప్రేక్షకులను ఈ సినిమా బాగా అలరిస్తుందని భావిస్తున్నాం. హీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. వారి పాత్రల్లో ఒదిగిపోయిన నటించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ వెల్లడిస్తాం” అని తెలిపారు.  ఇక ఈ సినిమాకు సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Read Also: మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోడీ - సుశ్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత ఎవరితో డేటింగ్ చేస్తున్నారో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget