72 Hoorain Movie: ‘కశ్మీరీ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ బాటలో మరో మూవీ - వైరల్ అవుతోన్న ‘72 హురైన్’ టీజర్
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన '72 హూరైన్' టీజర్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ నెట్టంట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా వివాదాస్పద నేపథ్యంతో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. ఈ సినిమాలు మంచి కలెక్షన్లను సాధించినప్పటికీ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారితీసాయి. ఇప్పడు ఇదే కోవలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన '72 హూరైన్'. ఈ మూవీలో పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంబంధించిన టీజర్ ను జూన్ 4 న విడుదల చేసింది మూవీ టీమ్. టీజర్ ను చూస్తుంటే ఉగ్రవాదానికి గల కారణాలను మెయిన్ లీడ్ గా తీసుకొని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
సమాజంలో ఉగ్రవాదం భయాందోళన కలిగించే అంశం. అయితే ఉగ్రవాదులు ఎక్కడో బయట నుంచి రారు మన మధ్య నుంచే పుడతారు. కొంత మంది మత ఛాందసవాదులు వికృత చేష్టలతో సాధారణ ప్రజలను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వాళ్లని బాంబర్లుగా మారుస్తున్నారని. హురైన్ 72 అనేది ఉగ్రవాదులు సామాన్యులను ఉగ్రవాదులుగా మార్చే శిక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారని, వాళ్లు చనిపోయిన తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలు వారికి సేవ చేస్తారని నమ్మించి.. వారిని ఉగ్రవాదంలోకి తోస్తారని సినిమా దర్శకుడు చౌహాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఉగ్రవాదం మూలకారణాలను కనిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. చాలా మంది మన లాంటి కుటుంబాలు వాళ్లు చేసే బ్రెయిన్ వాష్ వల్ల బాంబర్లుగా మారిపోతున్నారని, అలాంటి మూలాలనే ఈ సినిమాలో చూస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇక టీజర్ విషయానికొస్తే.. ఈ సినిమాను ప్రధానంగా హురైన్ 72 అనే అంశం చూట్టూ సాగే కథలా కనిపిస్తోంది. టీజర్ లో కూడా అదే డైలాగ్ ను ఉపయోగించారు. జీహాద్ కోసం ప్రాణాలు అర్పిస్తే తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలు మీకు సేవ చేస్తారు అనేదే హురైన్ 72 ఉద్దేశం. టీజర్ లో కూడా ఆ విషయాన్ని చూపించారు. అలాగే ఇందులో అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్, అజ్మల్ కసబ్, మసూద్ అజార్, హఫీజ్ సయీద్ మరియు యాకూబ్ మెమన్ వంటి వ్యక్తుల ఫోటోలను కూడా టీజర్ లో చూపించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ వివాదాస్పద సినిమాల కోవలోనే ఈ మూవీ కూడా సోషల్ మీడియాలో చర్చల దారి తీస్తోంది. ఇప్పటికే దీనిపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సినిమా టైటిల్ బాగుంది అని కొంత మంది అంటుంటే ఇలాంటి సినిమాలు తీసి ఆ వర్గంలో ఆందోళనలను కలిగించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఎలాంటి చర్చలకు దారితీస్తుందో చూడాలి. ఈ సినిమా జులై 7 న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?
View this post on Instagram