Kalyan Dasari Wedding: అంగరంగ వైభవంగా నిర్మాత దానయ్య కొడుకు పెళ్లి, హాజరైన తెలుగు సినీ దిగ్గజాలు!
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ ఓ ఇంటివాడు అయ్యాడు. వధువు సమత మెడలో మూడు ముళ్లు వేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు.
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట్లో పెళ్లి వాయిద్యాలు మోగాయి. ఆయన కొడుకు, యంగ్ హీరో కల్యాణ్ సంసార జీవితంలోకి అడుగు పెట్టాడు. బంధుమిత్రులు ఆశీర్వాదాలు, వేద పండితులు మంత్రాల నడుమ సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు టాలీవుడ్ దిగ్గజాలు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కల్యాణ్-సమత వివాహ వేడుకకు హాజరైన వారిలో హీరోలు రామ్ చరణ్, పవన్ కల్యాణ్, డైరెక్టర్లు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. నిర్మాత దానయ్య వచ్చిన అతిథులను దగ్గరుండి ఆహ్వానించారు. పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం కల్యాణ్- సమత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Happy Married Life @IamKalyanDasari 💐🎉#DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7
— Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023
సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ‘అధీర’
ఇక ప్రస్తుతం కల్యాణ్ హీరోగా ‘అధీర’ అనే సినమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు గౌరీ హరి సంగీతాన్ని అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యింది. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ గ్లింప్స్ ఆవిష్కరించారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది.‘అధీర’ పేరుతో విడుదలైన వీడియో ఇప్పటికే బాగా అలరిస్తోంది. ఈ సినిమా అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందబోతున్నట్లు ఈ విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ ఇందులో చూపించారు.
View this post on Instagram
పవన్ కల్యాణ్ హీరోగా ‘ఓజీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య
ఇక ‘RRR’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత ప్రస్తుతం దానయ్య పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘ఓజీ’ మూవీకి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే ముంబైలో కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ పుణెలోని ప్రకృతి అందాల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలోని పాటల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘ఓజీ’ తొలి షెడ్యూల్ కాగానే, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనాలి. కానీ, అనుకోకుండా ‘ఓజీ’ రెండో షెడ్యూల్ కు పవన్ ఓకే చెప్పడంతో షూటింగ్ కొనసాగుతోంది.
Read Also: అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు ఎంగేజ్మెంట్, వధువు ఎవరంటే?